Breaking News

ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని సంయుక్త కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో మొత్తం 547 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో సహకార సంఘాలు 472, మెప్మా 7, ఐసిడి ఎం ఎస్‌ 11, ఐకెపి 57 ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నాయని, మొదటి రకం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1835 సాధారణ రకం ధాన్యానికి రూ. 1815 మద్దతు ధర ల‌భిస్తుందని ఆయన తెలిపారు.

పెద్ద సంఖ్యలో రైతులు గుంపులుగా రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ వద్ద నిరీక్షణ చేయవల‌సిన అవసరం లేకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల‌కు టోకెన్లు అందజేయడం జరుగుతుందని, టోకెన్ల ప్రకారం ఎవరు ఏ తేదీన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకురావాల‌ని ఉంటుందో ఆ విధంగానే తేవాల‌ని, ఇందుకుగాను జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటనలో తెలిపారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article