Breaking News

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీ చేస్తామని వరుస క్రమంలో అందరికీ టోకెన్లు జారీ చేస్తామని సంయుక్త కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం ఆయన బియ్యం పంపిణీ జరుగుతున్న నగరంలోని పలు కంట్రోల్‌ దుకాణాల్లో ఆర్‌డివో వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. అక్కడక్కడ ప్రజలు రేషన్‌ కోసం గుమి కూడి ఉండడం చూశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికే ప్రభుత్వం బియ్యం సరఫరాకు టోకెన్ల పద్ధతిని అమలు చేస్తుందని, తద్వారా ప్రతిరోజు ప్రజలు పెద్ద సంఖ్యలో రేషన్‌ దుకాణాల‌ వద్ద గుమికూడ కుండా టోకెన్లు అందజేస్తున్నామని తెలిపారు.

ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు అందజేస్తామని ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందవల‌సిన అవసరం లేదని తొందర పడకుండా టోకెన్లు అందించిన తర్వాతనే కంట్రోల్‌ దుకాణానికి వచ్చి బియ్యం తీసుకోవాల‌ని ఆయన కోరారు. కరోనా వైరస్‌ సందర్భంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న కుటుంబాల‌ వారికి యంత్రాంగమే బియ్యాన్ని సరఫరా చేస్తుందని వారెవరూ కూడా ఆందోళన చెందకుండా బయటకు రావద్దని సూచించారు.

జిల్లాలో 751 రేషన్‌ దుకాణాల‌కు గాను 645 దుకాణాల‌ ద్వారా ఇప్పటికీ 45,000 కార్డుదారుల‌కు బియ్యాన్ని అందించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రతిరోజు కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల‌ను ప్రజల‌కు తెలియజేస్తుందని, అందుకు అనుగుణంగానే వ్యాపారస్తులు వాటిని విక్రయించాల‌ని, అధిక ధరల‌కు విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

The following two tabs change content below.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article