Breaking News

Daily Archives: April 3, 2020

జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొత్తగా 16 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ప్రకటన విడుదల‌ చేస్తూ గురువారం పంపిన 42 శాంపుల్స్‌లో 41 మందివి పరీక్ష నివేదికలు వచ్చాయని అందులో 16 గురికి కరోనా వైరస్‌ సోకినట్లు నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ఇంకా 25 మందికి నెగటివ్‌ వచ్చిందని, మరొకరి నివేదిక పెండిరగ్‌లో ఉందని కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని తదుపరి వైద్య ...

Read More »

‘దీప శ్లోకం’

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి టైం శ్వవచాహి విప్రాః కీటాశ్చ – పురుగులు` మశకాశ్చ – దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతిని చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమి మీద ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం ...

Read More »

సిలిండర్‌ గ్యాస్‌ లీకై పలువురికి గాయాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఉదయం సుమారు ఐదు గంటల‌ సమయంలో రాఘవపూర్‌ తండా ఇటుక బట్టీ దగ్గర గుడిసెలో సిలిండర్‌ గ్యాస్‌ లీకై ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. గొల్ల‌పూడి సమ్మయ్య (38), అతని భార్య చిన్నమ్మాయి (33), పిల్ల‌లు జోసెఫ్‌ (14), శ్రీల‌త (10) ల‌కు గాయాల‌య్యాయి. వీరు గుంటూరు జిల్లా నాదెళ్ళ గ్రామానికి చెందినవారు. క్షతగాత్రుల‌ను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు.

Read More »

డ్రోన్‌తో సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో పురపాల‌క సంఘం ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నివారణ చర్యలో భాగంగా డ్రోన్‌ యంత్రంతో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, జిల్లా ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, వైస్‌ చైర్మన్‌, కౌన్సిల‌ర్లు పాల్గొన్నారు.

Read More »

బియ్యం పంపిణీ ముమ్మరం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శుక్రవారం జనహిత భవనంలో డివిజన్‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేపట్టాల‌ని సూచించారు. తెల్ల‌ రేషన్‌ కార్డు ఉన్న ల‌బ్ధిదారుందరికీ బియ్యం అందేవిధంగా చూడాల‌ని కోరారు. డివిజన్ల వారీగా కరోనా వైరస్‌ నివారణకు చేపడుతున్న చర్యల‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. విడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌లు ...

Read More »

మహిళా సంఘాల‌కు శుభవార్త…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారత ఆర్థిక వ్యవస్థను కరోన వైరస్‌ లాక్‌ డౌన్‌ పరిస్థితుల‌ నుండి కాపాడేందుకు బ్యాంకు నుండి వివిధ వ్యక్తులు, సంస్థలు తీసుకున్న టర్మ్‌ లోన్లు మూడు నెలల‌ వరకు చెల్లింపు చేయకుండా ఉండేందుకు మారటోరియం ప్రకటించారు. మారటోరియం మహిళా సంఘాలు తీసుకొన్న రుణాల‌కు కూడా వర్తిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ప్రకారం మహిళా సంఘ సభ్యులు తీసుకొన్న రుణాల‌ వాయిదాలు మూడు నెల‌ల వరకు అనగా ...

Read More »

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. పేదల‌కు పులిహోర పంపిణీ చేశారు. అలాగే పిఎం ఫండ్‌ క్రింద జిల్లాలోని మూడు మున్సిపల్‌ పరిధిల‌ కోసం ల‌క్ష రూపాయల‌ చెక్‌ అందచేశారు. కరోన వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాల‌ని, చుట్టుపక్కల‌ వాతావరణం పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాల‌న్నారు. ఇంటికి వెళ్లి శానిటైజర్‌ లేదా సబ్బుతో ...

Read More »

కామారెడ్డి ఆసుపత్రిలో అన్నదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొన కోవిడ్‌ 19 వల‌న దేశం, రాష్టంలో లాక్‌ డౌన్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది రాకుండా కామారెడ్డి పట్టణంలోని జిల్లా ఏరియా ఆసుపత్రిలో నిత్యవసర వస్తువులు, అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నాయకులు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు షబ్బీర్‌ అలీ సమక్షంలో డిసిసి జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ ...

Read More »

పేదల‌కు అన్నం వడ్డించిన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ శివారులో కొన్ని స్వచ్ఛంద సంస్థల‌తో కలిసి మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ కరోన, కోవిడ్‌ 19 వల‌న దేశం, రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ వుండడం వల‌న ఎవరికి ఇబ్బంది రాకుండా పేదల‌ కోసం, వల‌స కూలీల‌ కోసం అన్నదాన శిబిరం ఏర్పాటు చేయించారు. శుక్రవారం స్వయంగా షబ్బీర్‌ అలీ పాల్గొని అన్నదానం చేశారు. అందరు కలిసి కరోన మహమ్మారిని అరికట్టాల‌ని, ...

Read More »

ప్రజల వద్దకే సరుకులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రజల‌ వద్దకే నిత్యావసర సరుకులు సంచార వాహనం ద్వారా అందించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. రూ. 500, రూ 1000 రెండు రకాల‌ కిట్లను వ్యాపారులు ఏర్పాటు చేశారని చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వారి కోసం సంచార వాహనంలో నిత్యావసర వస్తువుల‌ కిట్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Read More »

82 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 82 వాహనాలు సీజ్‌ చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 78 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 4 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం రాత్రి కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాల‌ని పేర్కొన్నారు. రాత్రి ...

Read More »