Breaking News

బియ్యం పంపిణీ ముమ్మరం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శుక్రవారం జనహిత భవనంలో డివిజన్‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేపట్టాల‌ని సూచించారు. తెల్ల‌ రేషన్‌ కార్డు ఉన్న ల‌బ్ధిదారుందరికీ బియ్యం అందేవిధంగా చూడాల‌ని కోరారు. డివిజన్ల వారీగా కరోనా వైరస్‌ నివారణకు చేపడుతున్న చర్యల‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు.

విడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డిఆర్‌డివో చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *