Breaking News

ఉచిత బియ్యం పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో రేషన్‌ షాపులో ఉచిత బియ్యాన్ని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి రేషన్‌ కార్డు ప్రతి ఒక్కరికి 12 కిలోల‌ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

రేషన్‌ షాపు వద్ద ల‌బ్దిదారులు గుమిగూడకుండా ప్రతి ఒక్కరు ఒక మీటరు దూరాన్ని పాటించాల‌న్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావొద్దన్నారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గా రెడ్డి, తహసిల్దార్‌ పి. నారాయణ, ఎంపీడీవో తోట పర్బన్నా, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌ రాం రెడ్డి, రేషన్ డీల‌ర్‌, నాయకులు సుభాష్‌, పీరిని సాయిు, తదితరులు ఉన్నారు.

Check Also

కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు

నిజాంసాగర్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని వాజీద్‌ నగర్‌ గ్రామ ఎంపిటిసి బండికింది ...

Comment on the article