Breaking News

అధికారులు తీసుకునే చర్యల‌కు ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా 18 కేసులు నమోదు కావడం చిన్న విషయమేమీ కాదని, ప్రజలు జాగ్రత్తగా ఉండకుంటే అందరికీ ఇబ్బందేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కరోనా వైరస్‌పై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్ని సిపి కార్తికేయతో కలిసి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఢల్లీి నుండి వచ్చిన వారిలో జిల్లాలో 18 కేసులు పాజిటివ్‌గా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు సీరియస్‌గా తీసుకుని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని తద్వారా వైరస్‌ మరింత విస్తరించకుండా ఆపడానికి వీల‌వుతుందన్నారు. వీరందరినీ గాంధీ ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు.

పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తులు నివాసముండే ఎ్లమ్మ గుట్ట, హబీబ్‌ నగర్‌, ఆటోనగర్‌, ముజాహిద్‌ నగర్‌, అర్సపల్లి, వాల్మీకి నగర్‌, కంటేశ్వర్‌, మాక్లూర్‌ తదితర ప్రాంతాల‌లో కిలోమీటర్ల మేర యాంటీవైరస్‌ ద్రావణాన్ని పిచికారి చేయడంతోపాటు ఇంటింటి సర్వే నిర్వహించి అందరూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఉన్నామన్నారు. ఈ ప్రాంతాల‌ను కంటెన్మెంట్‌ ప్రాంతాలుగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇందుకు ప్రజల‌ సహకారం తప్పనిసరిగా అవసరమని వ్యాధి తదుపరి విస్తరించకుండా ఉండాలంటే ప్రజలు బయటకు రావొద్దన్నారు. శాంపిల్స్‌ పంపిన వారిలో యుక్త వయస్సు ఉన్నవారికి ఈ ల‌క్షణాలు కనిపించకున్నా వారు బయట తిరిగి వైరస్‌ను ఇంటికి తీసుకు వెళ్తున్నట్లు గానే భావించాల‌న్నారు. ఈ వైరస్‌ వృద్ధుల‌కు పిల్ల‌ల‌కు సుల‌భంగా సోకడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు.

శనివారం ఎ్లమ్మ గుట్టలో ఒక వృద్ధుడు కరోనా ల‌క్షణాల‌తో ఆస్పత్రిలో చేరిన అరగంటలోనే చనిపోయాడని, అతను బయట ప్రయాణం చేయలేదని ఈ ఉదాహరణను ప్రజలు అర్థం చేసుకోవాల‌న్నారు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వవద్దని అన్ని మెడికల్‌ షాపుల‌కు ఆదేశాలు జారీ చేశామని, అదేవిధంగా ఆర్‌ఎంపీలు, పీఎంపీలు చికిత్స అందించే బదులు ఆ ల‌క్షణాలు ఉన్న వారిని ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌కు గాని ప్రభుత్వ ఆసుపత్రికి గాని పంపించాల‌ని పేర్కొన్నారు.

నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి కరోనా వైరస్‌ గురించే పూర్తిగా చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపించాల‌ని కోరారు. 14 రోజుల‌ క్వారంటైన్‌ పూర్తి అయిన వారిని మరికొన్ని రోజులు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కలిసిన ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు వివరాలు సేకరించామని 93 మందివి పరీక్షల‌ కొరకు శాంపిల్స్‌ పంపిస్తామని వివరించారు. మీడియా వారు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఐదుగురు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతావారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు – సిపి, కార్తికేయ

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది మనుషుల‌ సమస్యలు, ఇంకా సీరియస్‌ అయితే అందరికీ వస్తుందని ఈ విషయాల‌ను ప్రజలందరు గుర్తించాల‌న్నారు. ఒక్క తమకే కాకుండా కుటుంబ సభ్యుల‌కు కూడా విస్తరిస్తుందనే విషయాన్ని గ్రహించాల‌న్నారు. బయట పనుల‌కు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వారే వెళ్లాల‌ని, కుటుంబ పెద్దలు, మహిళలు బాధ్యత తీసుకొని ఎవరు కూడా తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళకుండా చూడాల‌న్నారు.

లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే నాన్‌ బెయిల‌బుల్‌ వారెంట్‌ జారీ చేయబడుతుందని, రెండు లేదా మూడు సంవత్సరాల‌ జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు 19 వంద వాహనాలు సీజ్‌ చేశామని, 50 కేసులు బుక్‌ చేశామని వివరించారు. ఢల్లీి వెళ్లి వచ్చిన వారు 80 కాదని 57 మాత్రమే అని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. మీడియా సమావేశంలో అదనపు సిపి రఘువీర్‌ పాల్గొన్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article