Breaking News

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 113 వ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 113 వ జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రామ్‌ 113వ జయంతి సందర్భంగా ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కొద్దిమంది అధికారుల‌ సమక్షంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో సభలు సమావేశాలు నిర్వహించకుండా అభిమానులు వారి నాయకుల‌ జయంతి వేడుకల‌ను ఇంట్లోనే ఉండి నివాళులు అర్పించాల‌ని ప్రభుత్వం ఆదేశించినందున కార్యక్రమాన్ని ప్రజల‌తో జరుపబడలేదు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూల‌మాల‌వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి శశికళ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, సంయుక్త కలెక్టర్‌ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article