Breaking News

అన్నిదానాల‌లో కెల్లా రక్తదానం గొప్పది

కామారెడ్డి, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపెట్‌ మండలం పరమ‌ల్ల‌ గ్రామానికి చెందిన ల‌త (28) అనే గర్భిణీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కాగా సదరు గర్భిణి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని సంప్రదించారు.

వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి చెందిన గణేష్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తాన్ని వి టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతకు ప్రత్యేక అభినందన‌లు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించాల‌నే ఉద్దేశంతో రక్తం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

భవిష్యత్తులో కూడా ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి సిద్ధమే అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే 9492874006 నెంబరులో సంప్రదించాల‌న్నారు. కార్యక్రమంలో సభ్యులు కిరణ్‌, రాజు, నర్సింలు, యేసు గౌడ్‌ తదితరులున్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *