Breaking News

పది కాదు ఎనిమిది

కామారెడ్డి, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కొన్ని పత్రికల‌లో వస్తున్న విషయం అవాస్తవమని, కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు తెంగాణ ప్రభుత్వం దృవీకరించినవి, ప్రతిపాదిత పరీక్షా కేంద్రాల‌లో నిర్దారించినవి 8 పాజిటివ్‌ కేసులుగా గుర్తించబడినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రస్థాయిలో వచ్చిన జాబితాలో కొన్ని పేర్లు రెండు సార్లు ప్రింట్‌ కావడంతో 8కి బదులుగా 10 పాజిటివ్‌ కేసులుగా ముద్రించబడినట్టు పేర్కొన్నారు.

పాజిటివ్‌గా నమోదైన కేసుల‌ వివరాలు ఇవి…

  1. న్యూమోనియా వ్యాధి గ్రస్తుడు – కామారెడ్డి
  2. ఢల్లీి నుంచి వచ్చిన కేసు – బాన్సువాడ
  3. కాంటాక్ట్‌ కేసు – బాన్సువాడ
  4. ఢల్లీి నుంచి వచ్చిన కేసు – బాన్సువాడ
  5. కాంటాక్టు కేసు – బాన్సువాడ
  6. కాంటాక్టు కేసు – బాన్సువాడ
  7. ఢల్లీి నుంచి వచ్చిన కేసు – బాన్సువాడ
  8. కాంటాక్టు కేసు – బాన్సువాడ

ఢల్లీి మత ప్రార్థనలో పాల్గొని వచ్చినవారు, వారితో సన్నిహిత సంబందం కలిగిన వారు, వారిని ప్రత్యక్షంగా కలిసిన వారు వుంటే స్వచ్చందంగా ముందుకు వచ్చి సమీప వైద్య సిబ్బందిని కలిసి పరీక్షల‌ కోసం సహకరించాల‌ని సూచించారు.

104 లేదా 18004251468, లేదా 7382928649, 7382929350 నెంబర్లలో సంప్రదించాల‌ని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article