Breaking News

ఆరుగురు వైద్యుల‌ రాజీనామా – తిరిగి విధుల్లోకి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు వైద్యులు శనివారం రాజీనామా చేశారు. ఆదివారం వైద్యుల‌తో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైద్యుల‌కు నచ్చజెప్పి తిరిగి విధుల్లో చేరే విధంగా ఒప్పించారు. ఓపి సామాజిక దూరం పాటించే విధంగా చూడాల‌ని వైద్యులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌, సూపరింటెండెంట్‌ అంగీకరించారు. వైద్యులు రాజీ నామాను వెనక్కి తీసుకొని విధుల్లో చేరనున్నట్లు ప్రకటించారు. విధుల్లో చేరిన వైద్యుల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, జిల్లా సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *