Breaking News

Daily Archives: April 6, 2020

కరోనా బాధితుల‌కు కంప్యూటర్‌ ఆపరేటర్ల ఒక్కరోజు వేతనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఈ పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు అందరు కలిసి జిల్లా పంచాయతి అధికారి డా.జయసుధ ద్వారా జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి కరోనా బాధితుల‌ సహాయార్థం తమ ఒక్కరోజు వేతనాన్ని, వంద మాస్కుల‌ను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు శివాజీ, ఆపరేటర్‌ రాజశేఖర్‌, అనిల్‌ తదితరులున్నారు.

Read More »

వల‌స కూలీల‌కు అన్నదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రొఫెషనల్‌ ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం భిక్కనూరు మండల‌ కేంద్రంలో గల‌ రెసిడెన్షియల్‌ వసతి గృహంలో బీహార్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల‌ దినసరి కూలీల‌కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 300 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్‌పి, భిక్కనూరు సిఐ, ఎస్‌ఐ, ఆర్‌డివో, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, యూనియన్‌ అధ్యక్షుడు అసం శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు, కంకణాల‌ సంగమేశ్వర్‌, సెక్రటరీ ...

Read More »

అనాద శవానికి అంత్యక్రియలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనాధాశ్రమంలో గత మూడు సంవత్సరాలుగా వుంటున్న లింగంపేట్‌ మండల‌ కేంద్రానికి చెందిన సాయిలు (34) ఆదివారం చనిపోయాడు. వారి బందువుల‌కు తెలియజేసినా కరోనా వైరస్‌ కారణంగా సాయిలు చనిపోవడంతో వారు ముందుకు రాలేదు. దీంతో ఆర్డీఓ బాంబే క్లాత్‌ ఓనర్‌ వీటి లాల్‌. తిరుమల‌ బటన్‌ స్టోర్‌ చందుని అంత్య క్రియలు నిర్వహించాల‌ని కోరారు. కరోనా వైరస్‌ కారణంగా ఎవరు ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంతో స్పందించి వారి స్వంత ఖర్చుల‌తో తమ ...

Read More »

సబ్బులు, గ్లౌస్‌లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం దోమకొండ మండలంలోని అంబర్‌ పేట గ్రామంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాల‌యం, పారిశుద్ధ్య కార్మికుల‌కు, ఆశ కార్యకర్తల‌కు ఉచితంగా డెటాల్‌ సబ్బులు, గ్లౌస్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాల‌ని బయటకు రావద్దని ...

Read More »

కరోనాపై పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్‌ నమోదు అయినందున దాని విస్తరణను కంట్రోల్‌ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌, ఏసిపి హెల్త్‌ టీమ్స్‌తో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వైరస్‌ కేసులు పెరిగిన దృస్ట్యా పకడ్బందిగా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం నుండి కంటేయిన్మెంట్‌ ఆదేశాల‌ను పటిష్టంగా అమలు ...

Read More »

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఇండియాలో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పాటించాల‌ని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ చెప్పిందని సీఎం గుర్తు చేశారు. మన దేశానికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదని సిఎం తేల్చిచెప్పారు. లాక్‌డౌన్ వ‌ల్ల‌ ఆర్థికంగా నష్టపోక తప్పదని ...

Read More »

నాణ్యమైన మాస్కులు తయారుచేయించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ జనహిత భవనంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజన్‌ స్థాయి అధికారుల‌తో మాట్లాడారు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది కూలీలు పనులు చేసే విధంగా చూడాల‌ని కోరారు. స్వయం సహాయక సంఘాల‌ ద్వారా నాణ్యమైన మాస్క్‌ల‌ను తయారు చేయించాల‌ని ఐకెపి అధికారుల‌ను ఆదేశించారు. విదేశాల‌ నుంచి వచ్చిన వ్యక్తుల‌ నుంచి 100 శాతం పాస్‌ ...

Read More »

జిల్లాలో మరో పది పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సిపి కార్తికేయతో కలిసి కొత్తగా నమోదైన కరోనా వైరస్‌ కేసులు, తదుపరి యంత్రాంగం తీసుకునే చర్యల‌పై ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధుల‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 19 పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం ప్రజల‌కు తెలుసని, మొన్న పంపిన నల‌భై ఒక్క శాంపుల్స్‌లో ...

Read More »

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు పండిరచిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల‌ ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజిని, జెడ్పిటిసి విజయ, విండో చైర్మన్‌ ప్రశాంత్‌ అన్నారు. సోమవారం రెంజల్‌ మండల‌ కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల‌ ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసిందని, ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల‌న్నారు. ప్రభుత్వం ...

Read More »

దివ్యాంగులు, వయోవృద్దుల‌కోసం…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్దుల‌ అత్యవసర సేవల‌కు టోల్‌ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. దివ్యాంగు సమస్యల‌ కోసం 1800 572 8980, వయోవృద్ధులైతే 14567 నెంబర్లకు అన్ని రోజుల‌లో ఉదయం 8 గంటల‌ నుండి రాత్రి 7 గంటల‌ వరకు ఫోన్‌ చేయవచ్చని మహిళా, పిల్ల‌లు, దివ్యాంగుల‌ మరియు వయోవృద్దుల‌ శాఖ కామారెడ్డి జిల్లా సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌ ...

Read More »

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు అధికారుల‌తో కరోనా వైరస్‌కు తీసుకునే చర్యల‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కార్యాల‌యంలోనూ క్షేత్ర స్థాయిలోనూ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించవసి ఉన్నదని, ఈ శాఖకు ...

Read More »

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు అందించాల‌ని మిషన్‌ భగీరథ నిజామాబాద్‌ డివిజన్‌ కార్యనిర్వాహక ఇంజనీరు రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »