Breaking News

కరోనాపై పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్‌ నమోదు అయినందున దాని విస్తరణను కంట్రోల్‌ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌, ఏసిపి హెల్త్‌ టీమ్స్‌తో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వైరస్‌ కేసులు పెరిగిన దృస్ట్యా పకడ్బందిగా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం నుండి కంటేయిన్మెంట్‌ ఆదేశాల‌ను పటిష్టంగా అమలు చేయాల‌న్నారు. 100 గృహాల‌కు ఒక ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఎక్స్టెన్షన్‌ ఆఫీసర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. క్లస్టర్‌ ఇన్చార్జిని నియమించాల‌న్నారు.

హోమ్‌ డెలివరీకి కావల‌సిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. రేపటినుండి ఎవరిని ఎట్టి పరిస్థితిలో బయటికి రానీయరాదన్నారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాల‌న్నారు. కాల్‌ సెంటర్‌ 24 గంటలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు.

మెడికల్‌ ఆశ వర్కర్స్‌ ప్రతి ఇంటికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించి ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపాల‌న్నారు. లేనివారిని హోం క్వారంటైన్‌ సెంటర్‌కు పంపాల‌న్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ కలెక్టర్ ల‌తా, డిఎం హెచ్‌ఓ సుదర్శనం, ఏవో సుదర్శన్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఎల్ల‌మ్మ గుట్ట వద్ద రూ. 20 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *