Breaking News

సబ్బులు, గ్లౌస్‌లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం దోమకొండ మండలంలోని అంబర్‌ పేట గ్రామంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాల‌యం, పారిశుద్ధ్య కార్మికుల‌కు, ఆశ కార్యకర్తల‌కు ఉచితంగా డెటాల్‌ సబ్బులు, గ్లౌస్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాల‌ని బయటకు రావద్దని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పాటించాల‌న్నారు.

సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సుల‌తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దాంట్లో భాగంగానే అంబర్‌ పేట గ్రామంలో ఉచితంగా డెటాల్‌ డబ్బులు, చేతి కవచాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జిల్లా కార్యదర్శి విజయ భాస్కర్‌, గ్రామ సర్పంచ్‌ ఎండి సలీం, ఏ ఎన్‌ఎం, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *