Breaking News

అనాద శవానికి అంత్యక్రియలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనాధాశ్రమంలో గత మూడు సంవత్సరాలుగా వుంటున్న లింగంపేట్‌ మండల‌ కేంద్రానికి చెందిన సాయిలు (34) ఆదివారం చనిపోయాడు. వారి బందువుల‌కు తెలియజేసినా కరోనా వైరస్‌ కారణంగా సాయిలు చనిపోవడంతో వారు ముందుకు రాలేదు.

దీంతో ఆర్డీఓ బాంబే క్లాత్‌ ఓనర్‌ వీటి లాల్‌. తిరుమల‌ బటన్‌ స్టోర్‌ చందుని అంత్య క్రియలు నిర్వహించాల‌ని కోరారు. కరోనా వైరస్‌ కారణంగా ఎవరు ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంతో స్పందించి వారి స్వంత ఖర్చుల‌తో తమ సిబ్బందితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా లాల్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా పేదల‌కు ఆహారం ల‌భించడం లేదని తమ వంతుగా రోజు ఆహారం ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *