Breaking News

నాణ్యమైన మాస్కులు తయారుచేయించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ జనహిత భవనంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజన్‌ స్థాయి అధికారుల‌తో మాట్లాడారు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది కూలీలు పనులు చేసే విధంగా చూడాల‌ని కోరారు. స్వయం సహాయక సంఘాల‌ ద్వారా నాణ్యమైన మాస్క్‌ల‌ను తయారు చేయించాల‌ని ఐకెపి అధికారుల‌ను ఆదేశించారు.

విదేశాల‌ నుంచి వచ్చిన వ్యక్తుల‌ నుంచి 100 శాతం పాస్‌ పోర్టుల‌ను తహసిల్దారులు స్వాధీనం చేసుకోవాల‌ని సూచించారు. ఉచిత బియ్యం పంపిణీ మంగళవారం మధ్యాహ్నం లోగా పూర్తి చేయాల‌ని, బియ్యం పంపిణీ పూర్తికాని డీల‌ర్‌ సంబంధిత తహసీల్దార్‌తో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో మంగళవారం సాయంత్రం జరిగే సమావేశానికి హాజరుకావాల‌ని సూచించారు. బాన్సువాడలో పారిశుద్ధ్య పనుల‌ను ముమ్మరం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వార్డుల్లో తడి పొడి చెత్తను సేకరించాల‌ని, నిత్యవసర వస్తువులు, కూరగాయలు సంచార వాహనాల‌ ద్వారా ప్రజల‌కు అందే విధంగా అధికారులు చూడాల‌ని కోరారు. వైరస్ ల‌క్షణాలు ఉన్న వ్యక్తుల‌ నుంచి శాంపిళ్లను మంగళవారం ఉదయం 100 శాతం సేకరించాల‌ని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, ఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ సాయన్న, జిల్లా ఆరోగ్య మిషన్‌ అధికారిని విశాల‌ రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *