Breaking News

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు పండిరచిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల‌ ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజిని, జెడ్పిటిసి విజయ, విండో చైర్మన్‌ ప్రశాంత్‌ అన్నారు. సోమవారం రెంజల్‌ మండల‌ కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల‌ ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసిందని, ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల‌న్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం రూ.1835 కు కొనుగోలు చేస్తున్నారని, అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టోకెన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వారానే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల‌కు తరలించాల‌ని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేష్‌ కుమార్‌, వికార్‌ పాషా, విండో ఉపాధ్యక్షుడు మొహినోద్దీన్‌, కార్యదర్శి రాందాస్‌, డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article