Breaking News

రైతులు దళారుల‌ను ఆశ్రయించద్దు

రెంజల్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల‌ను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల‌ని ఎంపీడీఓ గోపాల‌కృష్ణ, ఏపీఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండలంలోని దండిగుట్ట, బొర్గం, నీలా గ్రామల్లో సర్పంచ్‌లు శ్రీదేవి, వాణి, ల‌లితతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రైతు కష్టపడి ఆరుగాలం శ్రమించి పండిరచిన ధాన్యాన్ని దళారు పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల‌న్నారు.

ప్రభుత్వం రైతుల‌కు గిట్టుబాటు ధరను కల్పిస్తుందని, ప్రభుత్వ మద్దతు ధర ‘‘ఏ’’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1835 రూపాయలు,’’బి’’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1815 రూపాయల‌ను అందిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాల‌న్నారు.

కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ యోగేష్‌, ఎంపీటీసీ స్వప్న, ఉపసర్పంచ్‌ జగదీష్‌, సీసీలు శ్యామల‌, భాస్కర్‌, కృష్ణ, రాజయ్య, శివ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *