Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు ల‌క్షల‌ విరాళం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చాట్ల బీడీ కంపెనీ అధినేత ఉపేందర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఐదు ల‌క్షల‌ రూపాయల‌ విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కుని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కి అందించారు.

కరోన వైరస్‌ మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల‌తో కలిసి వచ్చి 5 ల‌క్షల‌ విరాళం ఇచ్చిన చాట్ల ఉపేందర్‌కి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అభినందించారు. చాట్ల ఉపేందర్‌ ఇచ్చిన చెక్కుని మంగళవారం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం గంప గోవర్ధన్‌ మంత్రి తారకరామారావుని స్వయంగా కలిసి అందించారు. ఐదు ల‌క్షల‌ విరాళాన్ని ఇచ్చిన చాట్ల ఉపేందర్‌ని మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *