Breaking News

క్లస్టర్‌ కార్యాల‌యం ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ ఆంక్షలు కంటేయిన్మెంట్‌ చర్యల‌ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, సంబంధిత అధికారుల‌తో కలిసి మంగళవారం నగరంలో పర్యటించారు. పెద్ద బజార్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద క్లస్టర్‌ కార్యాల‌యాన్ని ప్రారంభించారు.

అనంతరం ఖిల్లా రోడ్డు చౌరస్తా వద్ద బందోబస్తు పరిశీలించారు. మొగ‌ల్‌పూరా కాల‌నీ, ఖిల్లా రోడ్డు రెండు వైపులా బారికేడిరగ్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి నివాస ప్రాంతం పరిశీలించారు.

అత్యవసర పరిస్థితుల‌లో కాల‌నీలోకి అధికారులు లేదా బాధితులు వెళ్లడానికి అవసరమైన ద్వారము ఏర్పాటు చేయాల‌న్నారు. ప్రజల‌కు మొబైల్‌ వాహనాల‌ ద్వారా కూరగాయలు, కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి ముందుకు వచ్చే వారి వివరాలు సిద్ధం చేయాల‌న్నారు. కలెక్టర్‌ వెంట డిఈ రషీద్‌, రెండవ టౌన్‌ ఎస్‌ఐ ఆంజనేయులు, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

Check Also

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఎల్ల‌మ్మ గుట్ట వద్ద రూ. 20 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *