Breaking News

కామారెడ్డి జిల్లాకు 450 వరికోత యంత్రాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం డివిజన్‌ స్థాయి అధికారుల‌తో సమీక్షించారు. జిల్లాకు 450 వరి కోత యంత్రాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మూడు వందల మిషన్లు స్థానికంగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

150 మిషన్లను ఇతర రాష్ట్రాల‌ నుంచి ఇక్కడికి తెప్పిస్తామని చెప్పారు. ఏఈఓలు గ్రామాల్లో అందుబాటులో ఉండి వరి పంట కోతల‌కు రాగానే వారికి కూపనులు అందజేసి కొనుగోలు కేంద్రానికి దాన్యం వచ్చే విధంగా చూడాల‌ని సూచించారు. తేమ శాతాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు చూడాల‌ని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల‌కు కావసిన వస్తువుల‌న్నీ అధికారులు సమకూర్చాల‌ని, రైతు కొనుగోలు కేంద్రాల్లో గుంపులు గుంపులుగా ఉండకుండా చూడవల‌సిన బాధ్యత అధికారుల‌దేనని పేర్కొన్నారు.

రైతులు సామాజిక దూరం పాటించి కొనుగోలు కేంద్రాలు సజావుగా నడిచే విధంగా సహకరించాల‌ని కోరారు. సమావేశంలో అదనపుకలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డిసిఓ మమత, డిఆర్డీవో చంద్రమోహన్‌ రెడ్డి, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *