Breaking News

ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ శాఖ ఆధ్వర్యంలో వల‌స కార్మికుల‌కు గుడ్లు, బిస్కెట్లు అందజేశారు. బుధవారం బాటసారులు, వల‌స కార్మికులు ఉంటున్న రెసిడెన్షియల్‌ వసతి గృహంలో గుడ్లు బిస్కెట్‌ ప్యాకెట్‌లు అందజేశారు.

అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో పని చేసిన పూర్వ కార్యకర్త మల్లేశ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మల్లేశ్‌ ఇందుకు సంబంధించిన విరాళం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జరి కృష్ణ, బిక్నూర్‌ మండల‌ కన్వీనర్‌ సంజయ్‌, సమీర్‌, శివ పాల్గొన్నారు.

Check Also

తడి, పొడి చెత్త వాహనం ప్రారంభం

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని 47వ వార్డులో తడి, పొడి చెత్త వేరు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *