Breaking News

పోచారం ట్రస్టు ద్వారా ఉచిత బియ్యం

బాన్సువాడ, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిదిలోని పేదవారు ఒక్కరూ కూడా అన్నం లేక ఆకలితో బాదపడకూడదని, తెల్ల‌ రేషన్‌ కార్డు లేని పేదల‌ను గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి 25 కిలోల‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తానని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో బుధవారం స్పీకర్‌ విలేకరుల‌తో మాట్లాడారు.

పనులు లేక పేదలు, కూలీలు కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గత కొంతకాలంగా తెల్ల‌ రేషన్‌ కార్డు కోసం ధరఖాస్తు చేసుకుని కార్డు ఇంకా రాని వారు కూడా కొంత మంది ఉన్నారు. గ్రామాల‌ వారిగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పేదవారిని గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా అందించే బియ్యాన్ని పంపిణీ చేస్తారని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా స్పందించి తెల్ల‌ రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఇంటిలోని ఒక్కొక్కరికి 12 కిలోల‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. కరోనా మహమ్మారిని సంపూర్ణంగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు బాద్యతగా ఎవరింట్లో వారే ఉండాల‌ని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. మిగతా రాష్ట్రాల‌ కంటే ముందస్తుగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యల‌తో రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులో ఉందన్నారు.

ఢల్లీిలో జరిగిన మత సమావేశంలో పాల్గొన్న వారి వల‌న వ్యాప్తి లేకపోతే వైరస్‌ పూర్తిగా అదుపులోనే ఉండేదన్నారు. ఇంతటి కష్టకాలంలో కూడా పట్టణాల‌ను, పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిషలు కష్టపడుతున్న పారిశుద్య కార్మికుల‌కు మనందరం రుణపడి ఉండాల‌ని, వారి సేవల‌కు ప్రోత్సాహకంగా బాన్సువాడ పట్టణంలోని 116 మంది పారిశుద్య కార్మికుల‌కు ఒక్కోకరికి రూ.1000 పోచారం ట్రస్ట్‌ తరుపున అందించామని తెలిపారు.

Check Also

ప్రణాళికకు అనుగుణంగానే పంటలు సాగుచేయాలి

బాన్సువాడ, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, జిల్లా, రాష్ట్ర అవసరాల‌కు అనుగుణంగా ఏ ప్రాంతంలోని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *