Breaking News

నేను మీ జిల్లా కలెక్టర్‌ ను మాట్లాడుతున్నాను

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల‌కు ఇబ్బందులు పడకుండా ధాన్యం తెచ్చే విధానాన్ని వివరిస్తూ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి రైతు సోదరుల‌కు మెసేజ్‌ పంపారు. జిల్లా రైతు సోదరుల‌కు నమస్కారమని, తాను జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్నానని అంటూ కరోనా వైరస్‌ గురించి మీ అందరికీ తెలుసు అని లాక్‌ డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించి వ్యాధిని ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అప్పుడే ఇది ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల‌కు ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల‌లో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నందున గోనెసంచులు, హమాలిలు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.

అంతేకాక కొనుగోలు కేంద్రాల‌కు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైతులు రావడం ద్వారా కరోనా పొంచి ఉండే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకొని అధికారులు ఇచ్చిన తేదీ నాడే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల‌న్నారు. అంతవరకు గాలి, దుమారం, వర్షం వస్తే కాపాడుకోవడానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌న్నారు.

అదేవిధంగా నిబంధన ప్రకారం తేమ 17 శాతం మించకుండా శుభ్రమైన ధాన్యాన్ని కేటాయించిన తేదీలో కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాల‌ని, అక్కడ స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించాల‌ని తద్వారా రైతుల‌కు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. దానితోపాటు కరోనా మహమ్మారి కూడా మన దరి చేరదన్నారు. తద్వారా రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు. ఈ మెసేజ్‌ చెయిన్‌ సిస్టంలో రైతు సోదరులందరికీ చేరేలా షేర్‌ చేయాల‌ని కోరారు.

Check Also

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఎల్ల‌మ్మ గుట్ట వద్ద రూ. 20 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *