Breaking News

సామాజిక దూరం ఎక్కడా…?

బీర్కూర్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా ఈనెల‌ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించినా కొన్ని చోట్ల అధికారుల‌ నిర్లక్ష్యంతో ప్రజలు వార సంతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖాల‌కు ఎలాంటి మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా వర్ని, నసురుల్లాబాద్‌ ప్రధాన రహదారిపై వార సంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

వివరాల్లోకి వెళితే… వారాంతపు సంతల‌ను ప్రభుత్వం నిషేదించినప్పటికి బుధవారం నసురుల్లాబాద్‌ మండల‌ కేంద్రంలో వారంతపు సంత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించడం విశేషం. అధకారులు గానీ, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది గానీ వారాంతపు సంతలో ఉండకపోవడం గమనార్హం. సంబందిత విషయమై రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ పండరికి నిజామాబాద్‌ న్యూస్‌ వివరణ కోరగా బాన్సువాడ టీచర్స్ కాల‌నీలో విధుల్లో ఉన్నానని, పోలీసు అధికారుల‌కు సంఘటన వివరాలు తెలియజేస్తానని చెప్పడం గమనార్హం.

పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో సంత జరుగుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి ఒకరిపై ఒకరు పడుతూ క్రయ విక్రయాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సామాజిక దూరంపైన ప్రజల‌కు అవగాహన కల్పించాల్సిన అధికారులు చుట్టు పక్కల‌ ప్రాంతాల్లో ఎవరూ కనిపించడం లేదంటూ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అదికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల‌ని, లేకపోతే కరోనా విల‌యతాండవం చేస్తుందని అంటున్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *