Breaking News

పోచారం ట్రస్టు ద్వారా 25 కిలోల‌ ఉచిత బియ్యం

బాన్సువాడ, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో తెల్ల‌ రేషన్‌ కార్డు లేని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం అందని పేదల‌ను గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి 25 కిలోల‌ బియ్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల‌ దేవస్థానం వద్ద స్పీకర్‌ పోచారం పేదల‌కు బియ్యాన్ని అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొదటగా తెల్ల‌ రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని ఒక్కొక్కరికి 12 కిలో బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని, పనులు లేక పేదలు, కూలీలు కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడకూడదని పేర్కొన్నారు.

అదేవిదంగా గత కొంతకాలంగా తెల్ల‌ రేషన్‌ కార్డు కోసం ధరఖాస్తు చేసుకుని కార్డు ఇంకా రాని వారు కూడా కొంత మంది ఉన్నారని, నియోజకవర్గ పరిదిలోని 126 గ్రామ పంచాయితీ పరిది 230 గ్రామాల‌లో ఎక్కడ పేదలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా అందించే బియ్యాన్ని పంపిణీ చేస్తారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ పరిదిలోని పేదవారు ఒక్కరూ కూడా అన్నం లేక ఆకలితో బాదపడకూడదని పోచారం స్పష్టం చేశారు.

భౌతిక దూరం పాటించడమే కరోనా మహమ్మారి నివారణకు మందు అని, ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాల‌ని స్పీకర్‌ సూచించారు. కరోనా మహమ్మారి త్వరగా నశించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాల‌ని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నానని తెలిపారు.

రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో 40 ల‌క్షల‌ ఎకరాల‌లో రైతులు వరి సాగు చేశారని, పండిన ధాన్యాన్ని మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రైతులు తొందరపడి ప్రైవేటు వ్యాపారుల‌ చేతిలో మోసపోకుండా తమ ధాన్యాన్ని మద్దతు ధరకే అమ్ముకోవాల‌ని స్పీకర్‌ రైతుల‌కు సూచించారు.

Check Also

పెన్సిల్‌పై సేవాలాల్‌ సూక్ష్మ చిత్రం

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన జీవన్‌నాయక్‌ ...

Comment on the article