Breaking News

కంటోన్మెంట్‌ ఏరియాగా బర్కత్‌పుర

నందిపేట్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల‌ కేంద్రంలో ఢల్లీి వెళ్లి వచ్చిన దంపతుల‌లో భార్యకు పాజిటివ్‌ రావడం, ఆ తర్వాత వారి కుటుంభ సభ్యుల‌ను కూడ మాక్లూర్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విస్తరించకుండా జిల్లా అధికారుల‌ సూచన మేరకు మండల‌ అధికారులు కట్టు దిట్ట చర్యల‌కు సిద్ధమయ్యారు.

బర్కత్‌ పుర కాలనికి కంటోన్మెంట్‌ ఏరియాగా ప్రకటించి భద్రతా కట్టుదిట్టం చేసి రోడ్లను బారికేడ్లతో దిగ్బంధం చేసారు. కాల‌నీలోకి పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. కాలొనీ ప్రజల‌కు అవసరమయ్యే సరుకులు ఇంటికే చేరవేసేలా చర్యలు చేపట్టారు.

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వనున్నారు. అవరమున్న వారు ఫోన్‌ చేస్తే వారింటికే సరుకులు పంపనున్నారు. నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే పంపడానికి కాల‌నీలోని కిరాణ దుకాణం, కూరగాయల‌ దుకాణం, పాల‌కేంద్రాన్ని, ఆర్‌ఎంపి వైద్యున్ని ఎంపిక చేశారు. వారు మాత్రమే దుకాణాలు తెరిచేలా, పంపిణీ చేసేలా పాస్‌లు జారీచేయనున్నారు.

10 మంది వాంటీర్ల నియామకం

ఇండ్ల వద్దకు సరుకులు పంపడానికి యువజన సంఘాల‌ నుండి 10 మంది వాలంటీర్లను ఎంపిక చేసి పాస్లు జారీ చేయనున్నారు. వీరు వీరికి కేటాయించిన దుకాణాల‌ వద్ద వుంటారు. ఎవరైనా సరుకులు అవసరం వుండి కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినట్లయితే దగ్గరలోని దుకాణ యజమానికి సమాచారం ఇచ్చి వాలంటీర్‌ ద్వారా సరుకులు చేరవేస్తారు. కాల్‌ సెంటర్‌ నంబర్‌ 9542302797 కు ఫోన్‌ చేయగల‌రని నందిపేట్‌ పిఎస్‌ ఎస్‌ఎచ్‌ఓ రాఘవేందర్‌ తెలిపారు.

ఎవరు బయటకు రావద్దు.. ఎంపిడిఓ

మండ ప్రజలు ఎవరు బయటకు రాకుండా తమకు సహకరిస్తున్న విధంగా లాక్‌ డౌన్‌ ముగిసే వరకు సహకరించి బయటకు రావద్దని ఎంపిడిఓ నాగవర్ధన్‌ అన్నారు. బర్కత్‌ పుర ప్రజలు అత్యవసర వస్తువుల‌ నిమిత్తం కూడ బయటికి రావద్దని, వారికి ఏదైనా వస్తువులు అవసరముంటే ఫోన్‌ చేయాల‌ని తెలిపారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారు బయటకు వస్తే అధికారుల‌కు తెలియజేయాల‌ని ఆయన కోరారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article