Breaking News

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఎన్‌ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యుఐ జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్‌ రోడ్‌, రామారెడ్డి రోడ్‌, పాత బస్టాండ్‌, పోలీస్‌ స్టేషన్‌, కమాన్‌, నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, దేవునిపల్లి, లింగపూర్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో పేదల‌కు, ఆయా ప్రాంతాల్లో ఎండలో సైతం తమ విధులు నిర్వహిస్తున్న పోలీసు వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్‌, జిల్లా నాయకులు సుధీర్‌, సురేష్‌, ప్రకాష్‌, పట్టణ నాయకులు భరత్‌, ప్రశాంత్‌, రాహుల్‌, సుఫియన్‌, వినయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article