Breaking News

ఉమిస్తే ఏమవుతది…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రస్తుతం కోవిడ్‌ 19 మహమ్మారి ప్రబలుతోందని, ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరని పేర్కొంది.

అనారోగ్యకరమైన అల‌వాట్లను మానుకోవాల‌ని, వాటి వ‌ల్ల‌ వైరస్‌, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం వ‌ల్ల‌ ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే ప్రమాదం ఉందని, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్‌, లేదా ఉమ్మి ఊయటం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నామని ప్రకటించింది.

Check Also

కోడ్ ఉల్లంఘించారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల‌ ఎమ్మెల్సీ ఎన్నికల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *