Breaking News

నిరుపేదల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎన్జీవోస్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మూడు వందల‌ యాభై మంది నిరుపేదల‌కు జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు.

వీటిలో బియ్యం, పప్పు, కారంపొడి, పసుపు, టీ పొడి, మంచినూనె ఉన్నాయి. అనంతరం జిల్లా మీడియా ప్రతినిధుల‌కు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా ప్రెసిడెంట్‌ కిషన్‌, సెక్రెటరీ అమృత్‌ కుమార్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ రీజినల్‌ మేనేజర్‌ ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article