Breaking News

కరోనా కట్టడికి అవసరమైన చర్యల‌న్ని తీసుకుంటున్నాం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌పై వివిధ జిల్లాల‌ అధికారుల‌తో గురువారం రాత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సమీక్షించారు. జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రజల‌కు సంచార వాహనాల‌ ద్వారా నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందజేస్తున్నామని చెప్పారు. ఉచిత బియ్యం పంపిణీ జిల్లాలో పూర్తి చేసినట్లు చెప్పారు.

రేషన్‌ షాపుల‌ వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించి బియ్యాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ, మద్నూర్‌, పద్మాజివాడి చౌరస్తా వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల‌ వాహనాలు జిల్లాకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో రెండు విడతుగా వైద్య సిబ్బందితో సర్వే చేయించమని చెప్పారు. బాన్సువాడలో సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article