Breaking News

Daily Archives: April 10, 2020

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మాచారెడ్డి మండలంలోని భవాని పేట గ్రామంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల‌కు ఉచితంగా కిరాణా సరుకుల‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యాం రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాల‌ని బయటకు రావద్దని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం ...

Read More »

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎంపి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే జె.సురేందర్‌తో కలిసి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రామారెడ్డి మండల‌ కేంద్రంలో, గాంధారి మండలం గండివేట్‌ గ్రామాల‌లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ద్వారా వరి కొనుగోలు కేంద్రాల‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవవర్గంలో కరోన కట్టడికి తీసుకొంటున్న చర్యల‌ను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ప్రజల‌కు సామాజిక దూరం పాటించాల‌ని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాల‌ని, విధిగా మాస్కులు ధరించాల‌ని సూచించారు. ఈ సందర్బంగా తన ...

Read More »

మద్యం ప్రియుల‌ జేబుకు చిల్లు

నందిపేట్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మడలంలోని పలు గ్రామాల‌లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో మందుప్రియుల‌ జేబులకు చిల్లులు ప‌డుతున్నాయి. మార్చ్‌ 22 న జనతా కర్ఫ్యూ మరుసటి రోజు రాత్రి లోపు వైన్స్‌ షాపు లోని బీర్‌, బ్రాండి, విస్కీని ఆటో, కార్లలో రహస్య ప్రాంతాల‌కు తరలించి నిల్వ‌చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గోదావరి సమీపంలో గల‌ ఓ గ్రామంలోని వైన్స్‌ షాపు నుండి లాక్‌ డౌన్‌ మొదటి రోజు పట్టపగలు మద్యం బాటిళ్ళను తరలించారని తెలిసింది. ...

Read More »

ఇందూరుకు శుభవార్త… 112 నెగిటివ్‌ రిపోర్ట్స్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానంగా ఉన్నా 112 మంది రిపోర్ట్స్‌ వచ్చాయని వారెవ్వరికి కూడా వైరస్‌ లేనట్లు నివేదికలు వచ్చాయని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ కరోనా వైరస్‌ ఉన్న వారి శాంపిల్స్‌ తగు పరీక్షల‌కై పంపించగా 112 మంది నివేదికలు శుక్రవారం వచ్చాయని అవన్నీ కూడా నెగిటివ్‌ అని, వారెవరికి కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌ లేదని పేర్కొన్నారు. ...

Read More »

ఏబివిపి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ ఇందూర్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏబీవీపీ కార్యాల‌యంలో 50 మంది నిరుపేదల‌కు నెల‌కు సరిపడా నిత్యావసర సరుకుల‌ను పంపిణీ చేశారు. కరోన నేపథ్యంలో పేదల‌కు వస్తువుల‌ పంపిణీ చేసినట్టు కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షు రెంజర్ల నరేష్‌, జిల్లా సహా ప్రముఖ్‌ సురేందర్‌ రెడ్డి, నగుర్తి శంకర్‌, జగన్మోహన్‌ గౌడ్‌, వెంకటకృష్ణ, కరుణాకర్‌ రెడ్డి, అరుణ కుమార్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read More »

క్వారంటైన్లో ఉన్నవారు ధైర్యంగా ఉండాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆర్మూర్‌, పెర్కిట్‌, బాల‌కొండ, భీంగల్‌లోని కంటేయిన్మెంట్‌ క్లస్టర్స్‌, ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న వారు ధైర్యంగా ఉండాల‌న్నారు. మీకు అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. ఫుడ్డు, మెడిసన్‌, పండ్లు, పాలు, టి తెప్పించి ఇస్తారన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారు సామాజిక దూరం పాటించాల‌ని, ఎవరి రూమ్‌లో వాళ్లు ఉండాల‌ని, పాజిటివ్‌ ఉన్న వారి దగ్గర ...

Read More »

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

నందిపేట్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని సిర్పూర్‌ గ్రామంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ల‌త, ఎంపీటీసీ సంజీవ్‌, సొసైటీ డైరెక్టర్‌ రొడ్డ రాజుబాయి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండిరచిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా దళారుల‌ చేతిలో మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల‌లో మద్దతు ధరకు విక్రయించాల‌ని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గణేష్‌, రాజారెడ్డి, సొసైటీ ...

Read More »

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పేదల‌కు అన్నదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరుసగా పదకొండవ రోజు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సూచన మేరకు 300 మంది నిరుపేదల‌కు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రివద్ద, వల‌స కార్మికుల‌కు సిఎస్‌ఐ చర్చి కంపౌండ్‌ వద్ద, గుడిసెవాసుల‌కు టమాటో రైస్‌ పాకెట్స్‌, వాటర్‌ పాకెట్స్‌ డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో పంపిణి చేశారు. కార్యక్రమంలో వలిభిషెట్టి భాస్కర్‌, మహమ్మద్‌ సర్వర్‌, గంప ప్రసాద్‌, రామకృష్ణ, తాటిపల్లి ...

Read More »

అసంఘటిత రంగ కార్మికుల‌కు ప్రత్యేక నిధులు విడుదల‌ చెయ్యాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోన మమమ్మారి భారతదేశంలో వ్యాప్తి చెందకుండా దేశాన్ని పాలిస్తున్న పాల‌కులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అద్వితీయమైన పాత్రను పోషించడాన్ని ఎం సిపిఐ యు పార్టీ అభినందిస్తుందని, కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు కొనసాగించాల‌ని కోరుకుంటున్నామని ఎం సిపిఐ యు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల‌యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో మాట్లాడారు. ఇదే సందర్భంగా కరోనా కట్టడిలో ...

Read More »

మహిళకు రక్తదానం చేసిన అధ్యాపకుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన ఇశ్రత్‌ బేగం (24) రక్తహీనతతో పట్టణంలోని తిరుమల‌ నర్సింగ్‌ హోమ్‌లో చికిత్స పొందుతుంది. కాగా ఆమెకు ఏ నెగిటివ్‌ రక్తం అత్యవసరంగా కావాల‌ని వైద్యులు చెప్పడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలుని సంప్రదించారు. వెంటనే పట్టణానికి చెందిన తెలుగు అధ్యాపకుడు వేణుగోపాల‌ శర్మ సహకారంతో వి టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ఏ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ఇశ్రత్‌ బేగం ప్రాణాలు కాపాడారు. ...

Read More »

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో కరోనా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. బాన్సువాడ ఆర్‌డివో కార్యాల‌యంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పూట కాల‌నీలో పర్యటించాల‌ని సూచించారు. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, సంచార వాహనాల‌ ద్వారా ప్రజల‌కు అందే విధంగా చూడాల‌ని కోరారు. ఇతర రాష్ట్రాల‌ నుంచి దేశాల‌నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండేవిధంగా అధికారులు చూడాల‌ని పేర్కొన్నారు. ...

Read More »

నందిపేట్‌లో కరోనా కాల్‌సెంటర్‌ ఏర్పాటు

నందిపేట్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల‌ కేంద్రంలో బర్కత్‌పుర ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ ఏరియాగా గుర్తించడంతో అధికారులు స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌ హైస్కూల్‌లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎరలు రెడ్‌ జోన్‌లో సర్వే చేపడుతున్నారు. రెవిన్యూ, పోలీసు, మండల‌, గ్రామ పంచాయతీ సిబ్బంది కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నారు. వారికి భోజన సదుపాయాలు కల్పించాల‌ని సేవా దృక్పథంతో ఐలాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ సిద్దాపురం సుదర్శన్‌ 50 కిలోల‌ బియ్యాన్ని, మాదస్తు శేఖర్‌ ఐదు రోజుల‌కు సరిపడా ...

Read More »

గ‌ల్లంతైన వృద్దుని శవం ల‌భ్యం

నందిపేట్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఉమ్మెడ శివారులో గత రెండు రోజుల‌ క్రితం గోదావరి నది దగ్గర గుత్ప లిఫ్ట్‌ కెనాల్‌లో గ‌ల్లంతైన గంధం నడిపి గంగారాం యొక్క మృతదేహం శుక్రవారం ఉదయం ల‌భ్యమయింది. మృతదేహాన్ని స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

ఉజ్వల‌ యోజన పథకం గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

నందిపేట్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఉమ్మెడ గ్రామంలో పేద ప్రజల‌ కోసం ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన ఉజ్వల‌ యోజన పథకం కింద గ్యాస్‌ సిలిండర్‌ల‌ను జడ్పీటిసి యమున ల‌బ్దిదారుల‌కు అందించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారతదేశంలో పేద ప్రజల‌ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు నెలలు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌లు అందిస్తుందని అన్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరూ ...

Read More »

యువయూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కూరగాయల‌ వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట మండల‌ కేంద్రంలో యువ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వెయ్యి మంది నిరుపేదల‌కు కూరగాయల‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువ యూత్‌ అసోసియేషన్‌ వారు కూరగాయలు వితరణ చేయడం అభినందనీయమని, వారిని భగవంతుడు చ‌ల్ల‌గా చూడాల‌ని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆర్థికంగా ఉన్నవారు నిరుపేదల‌కు బియ్యం వితరణ చేయాల‌ని, ఆపద సమయంలో ఆదుకోవడానికి మంచి మనసుతో దాతలు ముందుకు రావాల‌ని కోరారు. ప్రజలు ఇళ్లకే ...

Read More »

208 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 208 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 193 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 2, ఫోర్ వీల‌ర్స్‌ 13, ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »