Breaking News

Daily Archives: April 12, 2020

137 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 137 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 127 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 6, ఫోర్ వీల‌ర్స్‌ 4, ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు ఆదివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

నిజామాబాద్‌లో 68 నెగటివ్‌ రిపోర్ట్స్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో తదుపరి పరీక్షల‌కు పంపిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్‌లో 68 మందికి నెగటివ్‌ వచ్చిందని వీరికి కరోనా లేదని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం 45 మంది ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టుకు సంబంధించి శాంపుల్‌ తగు పరీక్షల‌ కోసం పంపినట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. లాక్‌ డౌన్‌లో భాగంగా ప్రజలు వారం రోజులు నిబంధనలు కఠినంగా కచ్చితంగా 100 శాతం పాటించాల‌ని తద్వారా ఢల్లీి వెళ్లి వచ్చిన వారి ప్రైమరీ ...

Read More »

వైద్య సల‌హాల‌కు టెలి మెడిసిన్‌ కంట్రోల్‌ రూమ్‌లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య విషయాల‌లో డాక్టర్లకు ఫోన్‌ చేసి తగు సల‌హాలు పొందుటకు టెలిమెడిసిన్‌ కంట్రోల్‌ రూము ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ ప్రజలు దగ్గు, జ్వరం, జలుబు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే అత్యవసరంగా వారికి తగు సల‌హాులు సూచనలు అందించడానికి మూడు డివిజన్లలో టెలిమెడిసిన్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాదులో 8309219718, ఆర్మూర్‌లో 9398194337 ...

Read More »

వారం రోజులు చాలా ముఖ్యం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజులు లాక్‌ డౌన్‌ పాటించడం చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సిపి కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి కంటెన్మెంట్‌ క్లస్టర్‌ ఏరియాలో కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు. ఖిల్లా రోడ్డు, బర్కత్‌ పుర, అర్సపల్లి, మాల‌పల్లి, ఆటోనగర్‌, ఫ్రూట్స్‌ మార్కెట్‌, పెయింటర్‌ నగర్‌ ప్రాంతాల‌లో పర్యటించి లాక్‌ డౌన్‌ పరిశీలించారు. లాక్‌ డౌన్‌ పటిష్టత వల‌న మనకు వచ్చే వారం ...

Read More »

బిజెపి నాయకుల‌ రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధిలో తగినంత రక్త నిల్వ‌లు లేవని సమచారం అందటంతో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు ఆదివారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నరేష్‌ (సంగమేశ్వర్‌ గ్రామ ఉప సర్పంచ్‌) మాట్లాడుతూ ప్రస్తుతం కరొనా వ‌ల్ల‌ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రక్త నిల్వ‌లు కూడా లేవని, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణిల‌కు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని బీజేపీ ఆధ్వర్యంలో రక్తదానం చేశామని, కరొనా మహమ్మారిని సమిష్టిగా ...

Read More »

పోలీసు సిబ్బందికి మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్‌ స్టేషన్‌లో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచనల‌ మేరకు ఉచిత మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్‌ అధ్యక్షుడు వడ్ల నారాయణ చారి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోన వైరస్‌ వ్యాది నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాల‌ని, సామాజిక దూరం పాటించాల‌న్నారు. సమాచార హక్కు ...

Read More »

పారిశుద్య కార్మికుల‌కు ఆయుర్వేద మాత్రల‌ పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 24 వ వార్డ్‌ వెంకటేశ్వర కాల‌నీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల‌కు బియ్యం, కరోనా సోకకుండా ఆయుర్వేద మాత్రల‌ను స్థానిక కౌన్సిల‌ర్‌ ఆకుల‌ రాము చేతు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల‌ర్‌ ఆకుల‌ రాము మాట్లాడుతూ కరోనా వ్యాధి నిర్మూనలో భాగంగా పారిశుద్య కార్మికులు విశేష కృషి చేస్తున్నారని అభినందించారు. వారికి మునిసిపాలిటీ తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అదేవిధంగా ...

Read More »

13న రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ మొత్తం రాష్ట్రంలో రక్తం యొక్క కొరత ఏర్పడిరదని రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తల‌సేమియా పేషెంట్లు, గర్భవతులు, మిగతా పేషెంట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందూరు బ్లడ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో 13వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటల‌కు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. రక్త దాతలు ముందుకొచ్చి రక్త దానం చేసి ఇటువంటి విపత్కర సమయంలో ఆదుకోవాల‌ని పేర్కొన్నారు. ...

Read More »