Breaking News

Daily Archives: April 13, 2020

రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మ‌ల్ల‌వ్వకు పెద్ద మల్లారెడ్డి వద్ద ట్రాక్టర్‌ ఢీకొని గాయాల‌ పాలైంది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా మార్గమధ్యంలో రామాయంపేట్‌ చేరుకునే సరికి మ‌ల్ల‌వ్వ మృతి చెందింది. శవం పోస్టుమార్టం గదిలో ఉందని, పూర్తి వివరాల‌కు భిక్కనూరు పోలీసుల‌ను సంప్రదించాల‌ని తెలిపారు.

Read More »

నిరుపేద బాలింతకు పునర్జన్మ కల్పించిన మాజీ ఎంపి కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ నిరుపేద బాలింతకు మాజీ ఎంపి కవిత పునర్జన్మ కల్పించారు. సదరు బాలింత డెలివరీ తర్వాత ఫిట్స్‌తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తమను ఆదుకోవాల‌ని ట్విట్టర్లో కుటుంబ సభ్యులు వేడుకున్నారు. వెంటనే స్పందించిన మాజీ ఎంపి కవిత హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయించారు. కాగా సోమవారం ఆసుపత్రి నుంచి బాలింత డిశ్యార్జి అయ్యారు. తనను ఆదుకున్నందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌ నుండి ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వం రైతుల‌కు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం ఎంపిలు బి.బి.పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి ఆందోల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆందోల్‌ నియోజక వర్గంలో కరోన కట్టడికి తీసుకొంటున్న చర్యల‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు సామాజిక దూరం పాటించాల‌ని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మాస్కులు ధరించాల‌ని ...

Read More »

ఎపిడమాల‌జిస్టు పోస్టుకు దరఖాస్తుల‌ ఆహ్వానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ కమీషనర్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌ మేరకు కామారెడ్డి జిల్లాలో పనిచేయడానికి జిల్లాలో ఎపిడమాల‌జిస్టు పోస్టు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిడమాల‌జిస్టు పోస్టు కోవిడ్‌ 19 నేపథ్యంలో నాలుగు నెల‌లు పనిచేయడానికి అవుట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీచేయబడుతుందన్నారు. ఇందుకోసం ఎంబిబిఎస్‌ డిగ్రీతోపాటు డిపిహెచ్‌ (డిప్లమా ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌), యం.డి. యస్‌.పీఎం (సోషల్‌ ప్రీవెంటివ్‌ ...

Read More »

ఏప్రిల్‌ 30 వరకు కోర్టులు బంద్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌లో భాగంగా తెలంగాణ హైకోర్టు తాజాగా జారీచేసిన ఉత్తర్వుల‌ ప్రకారం ఏప్రిల్‌ 30 వరకు అన్ని కోర్టులు పనిచేయవని కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వి.ల‌క్ష్మణ్‌రావు, బండారి సురేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం విలేకరుల‌తో మాట్లాడుతూ హైకోర్టు విడుదల‌ చేసిన సర్కుల‌ర్‌ ప్రకారం కోర్టులో ఏ రకమైన వాజ్యాలు నడువవని తెలిపారు. అత్యవసర కేసులు ఉంటే కక్షిదారులు వారి న్యాయవాదుల‌ను మాత్రమే సంప్రదించాల‌ని సూచించారు. అదేవిధంగా ప్రజలు ...

Read More »

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రామారెడ్డి మండలంలోని పోసాని పేట్‌ గ్రామంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచనమేరకు రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌ అధికారుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసినట్లు రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు ల‌క్కాకుల‌ నరేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాల‌ని, బయటకు ...

Read More »

కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాయంలో వివిధ మండలాల‌ అధికారుల‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. మద్నూరు సరిహద్దులోని రోడ్లను మూసి ఉంచాల‌ని సూచించారు. బ్యాంకుల‌ వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాల‌ని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల‌ స్థాయి అధికారులు గ్రామస్థాయిలో పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. అధికారులు ...

Read More »

కామారెడ్డిలో రక్తదాన శిబిరం

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో సోమవారం జరిగిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ సందర్శించారు. రక్త దానం చేస్తున్న యువకుల‌ను అభినందించారు. అన్ని దానాల‌ కన్నా రక్త దానం గొప్పదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌, జిల్లా నోడల్‌ అధికారి విట్టల్‌ రావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో 100 నెగెటివ్‌, 3 పాజిటివ్‌ రిపోర్టు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మరో మూడు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం 52 కేసులు నమోదయ్యాయని ఈ సంఖ్య చిన్నది ఏమీ కాదని ప్రజలు పది రోజుల‌ పాటు మరింత కఠినంగా నిబంధనలు పాటించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వాయిస్‌ మెసేజ్‌ ద్వారా జిల్లా ప్రజల‌కు పిలుపునిచ్చారు. సోమవారం వాయిస్‌ మెసేజ్‌ ద్వారా ప్రజల‌తో మాట్లాడుతూ 103 మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ రిపోర్ట్స్‌ వచ్చాయని అందులో 100 నెగెటివ్‌ ఉన్నాయని, ముగ్గురివి ...

Read More »

కరోనాపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే సమీక్ష

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలోని అధికారుల‌తో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కరోనా పరిస్థితుల‌పై సోమవారం వీడియో కాల్‌లో మాట్లాడారు. మాక్లూర్‌, నందిపేట్‌, ఆర్మూర్‌ మండలాల‌ ఎంపీడీఓల‌తో ప్రస్తుత పరిస్థితుల‌ గురించి అరా తీశారు. గ్రామాల‌లో రేషన్‌ సరఫరా సానిటైజేషన్‌ వంటి పనుల‌ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్‌ పట్టణంలో జిరాయత్‌ నగర్ కాల‌నీ రెడ్‌ జోన్‌గా ఉన్న సందర్భంగా అక్కడ ఉన్న ఇన్‌చార్జితో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితుల‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధికి సోమవారం వెండి, బంగారు వర్తక సంఘం వారు 3 ల‌క్షల‌ 50 వేలు చెక్కును విరాళంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి అందజేశారు. సంఘం అధ్యక్షుడు పాలే ల‌క్ష్మీకాంత్‌, కార్యదర్శి పశువుల‌ రాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీపాద వెంకట్రావు, కోశాధికారి అద్దె నరసయ్య, చిలుక ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ల‌క్ష రూపాయల‌ చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్‌పిజి అసోసియేషన్‌ అధ్యక్షు డి సురేందర్‌, సెక్రటరీ నరసింహనాయుడు, ...

Read More »

టెలిమెడిసిన్‌ సెంటర్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వెల్‌నెస్‌ సెంటర్‌లో టెలిమెడిసిన్‌ సెంటర్‌ను సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. జిల్లా ప్రజల‌కు ఏవైనా దగ్గు, జ్వరం, తుమ్ము, ఇతరత్రా కోవిడ్‌ 19కి సంబంధించిన ఆరోగ్యపరమైన అనుమానాలుంటే టెలిమెడిసిన్‌ సెంటర్‌కు 8309219718 కు ఫోన్‌ చేయాల‌ని సూచించారు. తద్వారా ఫోన్‌ ద్వారా నిపుణులైన వైద్యులు సల‌హాలు, చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెంటర్‌ పనిచేస్తుందని ...

Read More »

ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ సేవలు అద్వితీయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌లోని రెడ్‌క్రాస్‌ భవనంలో ఇందూరు బ్లడ్‌ డ్ఱొనర్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథుగా ప్రిన్సిపల్‌ జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి పి.సుధా, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయి హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్‌ జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి పి.సుధా రక్తదానం చేయడం అందరికి స్పూర్తిదాయకమని నిర్వాహకులు తెలిపారు. లాక్‌ డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రక్త నిధులు తగ్గిపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర గవర్నర్‌, రాష్ట్ర ...

Read More »

మైలారం గ్రామంలో నిరుపేదల‌కు బియ్యం పంపిణీ

బీర్కూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండలం మైలారం గ్రామంలో రేషన్‌ కార్డు లేని నిరుపేదల‌కు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు పేర్క శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ యశోద, మహేందర్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, ఎస్సై సందీప్‌ కుమార్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్‌ డౌన్‌ తప్పక పాటిస్తూ ఇంట్లోనే ఉండాల‌న్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు తప్పకుండా ధరించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌న్నారు. ఇంటికి ...

Read More »

జిల్లా ప్రజల‌కు మంత్రి అంబేద్కర్‌ జయంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ప్రజల‌కు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో ప్రజలు ఒక చోట గుమిగూడ కుండా మహాత్ముల‌ జయంతి ఉత్సవాల‌ను ఇళ్లలోనే జరుపుకోవాల‌ని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా మహాత్ముని జన్మదినం సందర్భంగా ఆయన ...

Read More »