Breaking News

Daily Archives: April 14, 2020

ఉరివేసుకొని యువకుని ఆత్మహత్య

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం లింగాయిపల్లి గ్రామంలో తోట శ్రీనివాస్‌ (35) అనే యువకుడు ఉదయం 6.30 గంటల‌ సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు దేవునిపల్లి ఎస్‌ఐ తెలిపారు. శ్రీనివాస్‌కు భార్య సుమల‌త, పెద్ద కూతురు 8 సంవత్సరాలు, చిన్న కూతురు 1 సంవత్సరం ఉన్నారన్నారు. గతంలో యాక్సిడెంట్‌ అవ్వడం వ‌ల్ల‌ మతిస్థిమితం ఉందని, కుటుంబ కల‌హాల‌తో మనస్తాపం చెంది ఉరి వేసుకొని మరణించాడని పేర్కొన్నారు.

Read More »

ప్రధాని మోడీ చెప్పిన ఏడు సూత్రాలు

సీనియర్‌ సిటిజన్స్‌ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని వృద్దుల‌ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు తగిన సల‌హాలు, సూచనలు వైద్యుల్ని సంప్రదించాలి. విధిగా అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలి. నిరుపేదల‌కు అండగా ఉండాలి. ఆకలితో ఉన్న పొరుగువారికి అన్నం పెట్టాలి ఆరోగ్య సేతు యాప్‌ ఉపయోగించాలి. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తెలుసుకోవాలి. పరిశ్రమలు ఏ ఉద్యోగిని కూడా తొల‌గించకూడదు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్య తదితర సిబ్బందిని గౌరవించాలి. పై ఏడు సూత్రాలు ...

Read More »

ఆర్మూర్‌లో అంబేడ్కర్‌ జయంతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ వర్గాల‌ నాయకులు, పలువురు నేతలు పట్టణంలోని చౌరస్తాలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రజల‌కు సేవ‌లు చేస్తున్న పోలీసుల‌కు, పారిశుధ్య సిబ్బందికి శాలువ‌లు కప్పి పూల‌మాలతో సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌.పి.నరసింహనాయుడు, ఆర్మూర్‌ ఎంఇవో ...

Read More »

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, ఎం సిపిఐ యు పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి వేడుకలు ఉమ్మడిగా నిర్వహించినట్టు ఎం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా సీనియర్‌ నాయకుడు మాజీ జిల్లా కార్యదర్శి కందూరు చంద్రశేఖర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూల‌మాల‌వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్‌ దశరథ్‌ మాట్లాడుతూ ...

Read More »

పిఆర్‌టియు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో బి.ఆర్‌.అంబేద్కర్‌ 129వ జయంతి సందర్బంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషిని, సమసమాజ స్థాపనకు ఆయన సూచించిన విధి విధానాల‌ను పిఆర్‌టియు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మండల‌ విద్యాధికారి రాజగంగారాం, పిఆర్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలందర్‌, మండల‌ అధ్యక్షుడు కుషన్‌ రెడ్డి, ల‌క్ష్మన్‌, హరిప్రసాద్‌, సంతోష్‌, నర్సింహారెడ్డి, అశోక్‌, రవి, గోవర్ధన్‌, బాల‌రాజు, ప్రవీణ్‌ ...

Read More »

తెవివి సెల‌వుల‌ పొడిగింపు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే తెలంగాణ విశ్వవిద్యాయ పరిధిలో గత నెల‌ మార్చి 15 నుంచి కొనసాగుతున్న సెల‌వుల‌ను ఈ నెల‌ 30 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల‌ 12 న విడుదల‌ చేసిన జీ ఓ నెంబర్‌ ఎం ఎస్‌ 57 ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే విద్యార్థుల‌ ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని నష్ట పోకుండా ...

Read More »

ఏబివిపి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఇందూరు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 129వ జయంతిని ఏబివిపి కార్యాల‌యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రెంజర్ల నరేశ్‌ మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్‌ అని, ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఆరుగురు మేధావుల‌లో భారతదేశానికి చెందిన అంబేడ్కర్‌ ఒకరు కావడం మనందరి అదృష్టంగా భావించాల‌ని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయాల‌ను ప్రతి కార్యకర్త అనుసరించాల‌న్నారు. కార్యక్రమంలో నగుర్తి ...

Read More »

బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బార్‌ అసోసియేషన్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్‌ బి. ఆర్‌. అంబెడ్కర్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారం కామారెడ్డి కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ల‌క్ష్మణ్‌ రావు ఆధ్వర్యంలో అంబెడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌ కుమార్ పూల మాల‌ వేసి నివాళు ల‌ర్పించారు. అంబెడ్కర్‌ దేశానికి చేసిన సేవ‌లు గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్‌ రెడ్డి, పి.పి. అమృత రావు, సీనియర్‌ న్యాయవాదులు ...

Read More »

వల‌స కార్మికుల‌కు బియ్యం పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అంబారిపెట్‌ గ్రామంలో మంగళవారం డాక్టర్‌. బి.అర్‌ అంబేద్కర్‌ 129 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి మమ్మద్‌ అలీ షబ్బీర్‌ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌సి.సెల్‌ అధ్యక్షుడు, ఎంపీటీసీ ఫిరంగి.రాజేశ్వర్‌ సంచార జీవులు, వల‌స కార్మికులు, కూలీల‌కు బియ్యం పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు ఆకలితో ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి బియ్యం ...

Read More »

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మ‌ంగ‌ళ‌వారం రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచనల‌ మేరకు రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌ అధికారుల‌కు, ప్రజాప్రతినిధుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసినట్లు రామారెడ్డి మండల‌ అధ్యక్షులు ల‌క్కాకుల‌ నరేష్‌ తెలిపారు. లాక్‌ డౌను ప్రతి ఒక్కరూ పాటించి ఇంటి వద్దనే ఉండాల‌ని, ప్రజలు బయటకు రావద్దని అన్నారు. సమాచార హక్కు చట్టం ...

Read More »

కామారెడ్డిలో అంబేడ్కర్‌ జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ కార్యాల‌యం సమీపంలో అంబేద్కర్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ శరత్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త, అంటరానితనాన్ని నిర్మూలించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌, డిపిఓ సాయన్న, ఆర్‌డిఓ రాజేంద్రకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైల‌జ, అంబేద్కర్‌ సంఘాల‌ ...

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 వేలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి నిమిత్తం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి కి 25 వేల‌ చెక్కును నందిపేట్‌ మండలం నూత్‌ పల్లి గ్రామం శీను తరఫున అందజేశారు. కానిస్టేబుల్‌ు రవిందర్‌, కృష్ణ సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా భారత రత్న డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రత్న డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాల‌ వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌లు ల‌త‌, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి శశికళ, ఏవో సి హెచ్‌ భూమయ్య, ఏ ఎస్‌ డబ్ల్యూ రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

శుభకార్యానికి వచ్చి లాక్‌ డౌన్‌

నందిపేట్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుభకార్యానికి వెళ్లి సరదాగా రెండురోజులు తమ కుటుంబ సభ్యుల‌తో గడిపి వద్దామని ముంబై నుంచి తమ బంధువుల‌ ఇంటికి వచ్చి చిక్కిపోయరు. వివరాల్లోకి వెళ్తే నందిపేట్‌ మండలంలోని మారంపల్లి గ్రామానికి మార్చి 17 తేదీన 12 మంది ముంబయి నుండి శుభకార్యానికి వచ్చారు. 20వ తేదీన కార్యక్రమం పూర్తయింది. తిరిగి ఇంటికి వెళ్దామనుకునే సరికి కరోన వైరస్‌ విజృంబిస్తున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ అమలైంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా తమ ...

Read More »

బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నిజామాబాద్‌ నగరంలోని పులాంగ్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల‌ సుధాకర్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కేవలం ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక జాతి కొరకు పని చేయలేదని గుర్తు చేశారు. భారతదేశంలో ప్రతి మనిషి గురించి ఆలోచించిన ...

Read More »