Breaking News

Daily Archives: April 15, 2020

తెలంగాణ‌లో రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లు ఇవే…

రెడ్‌ జోన్‌లో 170 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్‌లో 207, మిగతావి గ్రీన్‌ జోన్‌లో రెడ్‌ జోన్‌లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు 14 రోజుల్లో కొత్త కేసు లేకపోతే రెడ్‌ జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు – ఆరెంజ్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్పు తెంగాణలో రెడ్‌ జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు : హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్‌ తెంగాణలో రెడ్‌ జోన్‌ ...

Read More »

కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో మజ్జిగ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేశారు. కామారెడ్డి, లింగాపూర్‌, దేవునిపల్లి, సదాశివనగర్‌ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ల‌క్ష్మణ్‌ రావు, సభ్యులు గంగాధర్‌, అమృత రావు, భానుప్రసద్‌, భార్గవ, శ్రవణ్‌, సుమంత్‌, కౌన్సిల‌ర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ తదితరులు ...

Read More »

కామారెడ్డిలో టెలి మెడిసిన్‌ కేంద్రం ఏర్పాటు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాదికారి కార్యాల‌యంలో బుధవారం టెలిమెడిసిన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ ప్రారంభించారు. కేంద్రంలో వైద్యాధికారి, పారా మెడికల్‌ సిబ్బంది ఉంటారని, ఫోన్‌ ద్వారా తమ సమస్యలు వివరిస్తే వైద్యులు ఫోన్‌ ద్వారా సల‌హాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నారు. టెలి మెడిసిన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయబడతాయని, అనంతరం కాలంలో పర్యవేక్షణ చేస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ వివరించారు. అవసరమైతే వీడియో ...

Read More »

ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సహాయ చర్యలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ను అదుపుచేయడానికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది, పారిశుద్య కార్మికులు, అధికారులు, బ్యాంకు సిబ్బందికి తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సానిటైజర్‌, మాస్కులు, గ్లౌజులు, అరటిపండ్లు అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ ప్రవీణాబాయి ఆదేశాల‌ మేరకు బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే చాలా దూరం నుంచి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వల‌స కూలీల‌కు ఆహారం, పండ్లు అందజేశారు. పారిశుద్య కార్మికురాలిని శాలువాతో సన్మానించారు. ...

Read More »

న్యాయవాద సొసైటీ ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 26న జరగాల్సిన నిజామాబాద్‌ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీ ఎన్నికల‌ను కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల‌ అధికారులు బండారి కృష్ణానంద్‌, జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవీ కాలం పూర్తయిన నలుగురు డైరెక్టర్‌ పదవుల‌తో పాటు పూర్తి కమిటిని లాక్‌ డౌన్‌ పూర్తయిన తర్వాత కొత్త ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల‌ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు జిల్లాలోని న్యాయవాదులు సహకరించాల‌ని కోరారు.

Read More »

కిరాణ దుకాణ యజమానిపై కేసునమోదు

బీర్కూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో లాక్‌ డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న ఎం.నర్సింలు కిరాణం అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ సతీష్‌ వర్మ తెలిపారు. అధిక ధరకు విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Read More »

బీర్కూర్‌లో ఒకరికి కరోనా ల‌క్షణాలు

బీర్కూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు నెల క్రితం హార్వెస్టర్‌ సంబంధిత పనుల‌ కోసం ఓ వ్యక్తి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పెంట క్యాంపునకు వచ్చాడు. అప్పటినుండి అతను శ్రీకాంత్‌ వద్దనే ఉంటూ ఫిబ్రవరి 26 వరకు తెనాలి, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల‌లో హార్వెస్టర్‌ పనుల‌కు అతని సహచరులైన విజయ్‌, బాలుతో కలిసి వెళ్ళాడు. తిరిగి మార్చ్ నెల‌ చివర్లో బోధన్‌ రూరల్‌కి వచ్చాడు. అనంతరం వారం రోజుల‌ క్రితం హార్వెస్టర్‌ పనుల‌ కోసం వెంకటప్పయ్య క్యాంపు, బీర్కూర్‌ మండలానికి ...

Read More »

డిజిటల్‌ థర్మామీటర్‌ సరఫరా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నుండి సరఫరా చేయబడిన 40 డిజిటల్‌ ధర్మామీటర్‌ల‌ను జిల్లాలోని సిహెచ్‌సిలు, ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లు, కంటేయిన్మెంట్‌ క్లస్టర్‌లో పనిచేస్తున్న వైద్యాధికారుల‌కు, వైద్య సిబ్బందికి సరఫరా చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. తద్వారా ఇక్కడగల‌ ప్రజల‌కు టెంపరేచర్‌కి సంబంధించిన పరీక్షలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. అంతకుముందు ఆయన వీటి పనితనాన్ని స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, ల‌త, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధికి దాతల‌ విరాళాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకొనే చర్యల్లో భాగంగా దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తూనే ఉన్నారు. బుధవారం పలువురు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని కలెక్టరేట్‌లో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల‌ను అందజేశారు. శ్రద్దానంద్‌ గంజ్‌లోని ద నిజామాబాద్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండు ల‌క్షల‌ రూపాయల‌ విరాళం అందించారు. విజయల‌క్ష్మి ఉపాధ్యాయురాలు తన సొంతంగా 25 వేల‌ రూపాయలు విరాళం అందించారు. బొంబాయి నర్సింగ్‌ హోమ్‌లో పనిచేసే అర్చన, ప్రమోద్‌ ఐదు ...

Read More »

రూ. 1500 వచ్చేశాయ్‌…

నందిపేట్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి రూ. 1500 చొప్పున ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ల‌బ్ధిదారుల‌ ఖాతాల్లో నగదు జమ అయినట్లు ఫోన్‌ కు మెసేజ్‌ రావడంతో బుధవారం నుండి బ్యాంకుల‌ వద్ద సందడి నెకొంది. దీంతో బ్యాంకుల‌ వద్ద జనం గుమిగూడారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసు సిబ్బంది ప్రజల‌ను సామాజిక దూరం పాటించేలా చేశారు. వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి ...

Read More »

మే 3 వరకు లాక్‌ డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండో విడత లాక్‌ డౌన్‌ మే 3 వరకు పొడిగించినందున నిబంధనలు ప్రతి ఒక్కరు కఠినంగా పాటించే విధంగా అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన ఢల్లీి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని జిల్లా కలెక్టర్లతో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల‌పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 3 వరకు ...

Read More »

ఎలాగైనా ఇంటికి చేరాలి…

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాగైనా ఇంటికి చేరాల‌ని బీహార్ వల‌స కూలీలు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై నడక ప్రయాణం సాగిస్తున్నారు. డిచ్‌పల్లి నుంచి నడుచుకుంటూ వెళుతున్న వారికి అండగా మేమున్నామని చేయూతను అందిస్తున్నారు ఘనపూర్‌ యువత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న వారికి, ఊర్లో ఉన్న యాచకుల‌కు, పారిశుద్ధ్య సిబ్బందికి, మిషన్‌ భగీరథ పైపు తెచ్చిన లారీ డ్రైవర్లకు ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తూ మానవతా దృక్పథాన్ని ...

Read More »

వరికోత యంత్రాల‌ ధర కలిసికట్టుగా నిర్ణయించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి కోత యంత్రాల‌కు గంటకు చొప్పున ధరను రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, రైతులు కలిసి నిర్ణయించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాయం జనహితలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ మండలాల‌ అధికారుల‌తో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కోతకు గంటకు ధరను నిర్ణయించాల‌ని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద హ్యాండ్‌ సానిటైజర్ల్లు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ఏఈఓలు ...

Read More »

ఆటో డ్రైవర్‌ల‌కు మంజీర ఫౌండేషన్‌ చేయూత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన లాక్‌ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఆపన్నుల‌ అవసరాలు తీరుస్తుంది. మంజీరా ఫౌండేషన్‌. బుధవారం పేదరికంలో ఉన్న ముగ్గురు ఆటో డ్రైవర్‌ల‌కు నెల‌కు సరిపడా కిరాణా సరుకులు అందజేశారు. ఇక కరోన లాక్‌ డౌన్‌ రోజుల‌లో పేదల‌ ఆకలి తీర్చేందుకు తమకు సహకరిస్తున్న, విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఫౌండేషన్‌ ప్రతినిధులు పురుషోత్తం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

నిజామాబాద్‌లో 70 నెగటివ్‌, 2 పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నె 12న 40 శాంపిల్స్‌, 13న 32 శాంపిల్స్‌ కరోనా పరీక్షల‌ కొరకు పంపగా మొన్నటి దాంట్లో 1, నిన్నటి దాంట్లో 1 పాజిటివ్‌ రాగా మిగతా 70 నెగిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండిరటిలో ఒకటి నిజామాబాద్‌ లోను, రెండవది మానిక్‌ బండార్‌లోను నమోదైనట్లు కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు.

Read More »

ల‌యన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు మండలం మాధవనగర్‌ గ్రామంలో వల‌స కూలీల‌కు ల‌యన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా ఆద్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 50 మంది కూలీల‌కు నూనె, గోధుమ పిండి, కందిపప్పు, ఉల్లిగడ్డలు తదితర నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో ల‌యన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా అధ్యక్షుడు వి. శివాజీ, కార్యదర్శి ధనంజయ రెడ్డి, కోశాధికారి రామారావు, పూర్వాద్యక్షుడు అంకం ల‌క్ష్మణ్‌, సూర్య భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జేసిఐ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేసిఐ నిజామాబాద్‌ ఇందూర్‌ ఆధ్వర్యంలో బుదవారం వి.ఎన్‌.ఆర్‌. పాఠశాల‌లో నిరుపేదల‌కు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి కరోన పట్ల అవగాహన కల్పించారు. 30 మంది నిరుపేదల‌కు బియ్యం, కూరగాయలు, మంచినూనె తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించాల‌ని జేసిఐ ఇందూర్‌ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి ఈ సందర్భంగా సూచించారు. జేసిఐ పూర్వ జోన్‌ ఆఫీసర్ జిల్క‌ర్ విజయానంద్‌, ...

Read More »

‘మా స్నేహం’ నిత్యవసర సరకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మా స్నేహం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దినసరి వేతన కార్మికులైన టెంపరరీ డ్రైవర్‌ల‌కు బుధవారం నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక వినాయక నగర్‌లో చిన్ననాటి మిత్రులందరూ ఏర్పాటు చేసుకున్న మా స్నేహం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దినసరి వేతన కార్మికులైన దాదాపు 45 టెంపరరీ డ్రైవర్‌ కుటుంబాల‌కు నిత్యావసర సరుకులు అందజేశారు. మా స్నేహం సేవా సంస్థ ప్రతినిధులు నరాల‌ సుధాకర్‌, వేణుగోపాల్‌, గిరీష్‌, శంకర్‌ తదితరులు ఇందుకు సహకరించిన ...

Read More »