Breaking News

Daily Archives: April 16, 2020

59 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 59 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 59 ద్విచక్ర వాహనాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాల‌ని పేర్కొన్నారు. రాత్రి ...

Read More »

సామాజిక దూరం అతిక్రమిస్తే జైలుకు పంపండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ధైర్యంతో పని చేస్తున్నారని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఆర్‌డివోలు, మున్సిపాలిటీ కమిషనర్లను, ఇతర అధికారుల‌ను కోరారు. గురువారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పిహెచ్‌సి సిహెచ్‌సి స్థాయి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆర్‌డివోలు, మున్సిపాలిటీ కమిషనర్లతో, ఇతర అధికారుల‌తో కరోనా వైరస్‌ గురించి మాట్లాడారు. కరోనా వైరస్‌ భయంతో ప్రైవేట్‌ ఆసుపత్రులు మూసివేశారని ఇటువంటి ...

Read More »

ఉపాధి హామీ కూలీల‌ సంఖ్య పెంచాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కూలీల‌ సంఖ్య పెంచాల‌ని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహిత భవనంలో గురువారం మాచారెడ్డి, గాంధారి, బిచ్కుంద, జుక్కల్‌, లింగంపేట, సదాశివనగర్‌ మండలాల‌ పంచాయతీ కార్యదర్శుల‌తో ఉపాధి హామీ పనుల‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హరిత హారంలో నాటిన మొక్కల్లో 85 శాతం జీవించి ఉండే విధంగా కార్యదర్శులు, సర్పంచులు చూడాల‌ని కోరారు. ప్రతి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాల‌ని, శ్రమశక్తి ...

Read More »

పారిశుద్య సిబ్బందికి మాస్కులు, దుస్తుల‌ వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య సిబ్బందికి గురువారం మాస్కులు, దుస్తుల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పి శ్వేత పంపిణీ చేశారు. మై విలేజ్‌ మోడల్‌ విలేజ్‌ వ్యవస్థాపకుడు బాల‌రాజ్‌ గౌడ్‌ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు వీటిని వితరణ చేసినట్లు పేర్కొన్నారు.

Read More »

నిజామాబాద్‌లో 57 నెగటివ్‌, 3 పాజిటివ్‌ రిపోర్టు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 63 కరోనా వైరస్‌ శాంపిల్స్‌ తగు పరీక్షల‌కై పంపగా వాటిలో 57 నెగటివ్‌, మూడు పాజిటివ్‌ వచ్చాయని, మరో ముగ్గురి శాంపిల్స్‌ తిరిగి మరోసారి పంపించాల‌ని కోరినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 63 మంది మర్కజ్‌ నుంచి వచ్చిన వారు ఉండగా వారిలో 32 మందివి పాజిటివ్‌ వచ్చాయని, మరో 20 పాజిటివ్‌, వారి కుటుంబ సభ్యుల‌వి, 5 ఇతర కుటుంబ సభ్యుల‌కు 1 దుబాయ్‌ వెళ్లి ...

Read More »

బ్యాంకు వద్ద గుంపులుగా ఉండరాదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు వద్ద, రేషన్‌ షాపు వద్ద గుంపులు గుంపులుగా ఉండరాదని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిరుపేదల‌కు బ్యాంక్‌ అకౌంట్‌ ఆధార్‌ లింక్‌ ఉన్న వారికి 1500 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని డబ్బు వారి ఖాతాలోనే ఉంటాయని వాటిని ఖాతాదారులు ఎప్పుడైనా తీసుకోవడానికి అవకాశం ఉందని, తొందరపడి గుంపులుగా వచ్చి వైరస్‌ బారిన పడకూడదని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం అర్సపల్లి ఎస్‌బిఐ ...

Read More »

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండలంలోని బస్వాపూర్‌లో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల‌కు ఉచితంగా కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ లాక్‌ డౌన్‌ పాటించి ఇంట్లోనే ఉండాల‌ని సూచించారు. సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సుల‌తో పాటు సామాజిక సేవా ...

Read More »

లాక్‌ డౌన్‌ పాటిస్తేనే కరోనా కట్టడి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వ‌ల్ల‌నే జిల్లాలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ వ్యాప్తి జరగకుండా అరికట్ట కలుగుతామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వీడియో మెసేజ్‌ ద్వారా ప్రజల‌కు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్‌ ప్రజల‌కు వీడియో మెసేజ్‌ పంపించారు. అందులో మాట్లాడుతూ జిల్లాలో 58 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయని జిల్లాను రెడ్‌ జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు అన్నారు. దీనిని గ్రీన్‌ జోన్‌గా మార్చాలంటే ప్రజలు ...

Read More »

లాక్‌ డౌన్‌ ప్రతి ఒక్కరు పాటించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి అరికట్టడానికి లాక్‌ డౌన్‌ ప్రతి ఒక్కరు పాటించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్‌ బోధన్‌ మున్సిపాలిటీలోని అనిష నగర్‌, శక్కర్‌ నగర్‌, రాకాసి పేట ప్రాంతాల‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 14 రోజులు చాలా కఠినమైన లాక్‌ డౌన్‌ పాటిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చి మనం ఆరెంజ్‌ జోన్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం మన జిల్లా రెడ్‌ జోన్‌లో ఉన్నదని, ...

Read More »

గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండ కేంద్రంలోని సిద్ధార్థ విద్యాయంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు బాలికల‌ విద్యను ప్రోత్సహించారని, బాలిక విద్య కోసం పాఠశాలల‌ను స్థాపించారన్నారు. మహిళ చదువుకున్నట్లయితే వంద మంది ఉపాధ్యాయుల‌తో సమానమని పేర్కొన్నారు. బాల్య‌వివాహాల‌ను అరికట్టి, ...

Read More »

డ్రోన్‌లో లాక్‌డౌన్‌ చిత్రాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో గురువారం డోన్‌ కెమెరాతో లాక్‌ డౌన్‌ పర్యవేక్షణను కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత పరిశీలించారు. డోన్‌ కెమెరా వివిధ ప్రాంతాల‌కు వెళ్లి ఫోటోల‌ను సేకరించింది. వాటిని అధికారులు చూశారు. లాకుడౌను సందర్భంగా పట్టణంలోని వీధుల్లో జనసంచారం లేక వెల‌వెల‌బోయిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

Read More »

హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల‌ను వైద్య సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విదేశాల‌ నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల‌, జిల్లాల‌ నుంచి వచ్చిన వ్యక్తుల‌కు వైద్య సిబ్బంది తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉంచాల‌ని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేసుకున్నవారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల‌ గురించి ...

Read More »

డిచ్‌పల్లిలో యాచకుల‌కు అన్నదానం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాకుడౌన్‌ విధించిన సందర్భంలో సరైన తిండి దొరకక భిక్షగాళ్లు అల్లాడిపోతున్నారు. రోడ్లపైన జనసంచారం లేకపోవడంతో భిక్షం వేసే వారు కరువయ్యారు. హోటళ్ళు, ఇతరత్రా దుకాణాలు మూసి ఉండడంతో భిక్షాటన చేయలేకపోతున్నారు. విషయం గమనించిన డిచ్‌పల్లికి చెందిన రవి, సౌజన్య దంపతులు గురువారం అన్నదానం చేశారు. ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన యువత గత 16 రోజుల‌ నుంచి అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు 80 మంది పేదవారికి అన్నం పొట్లాలు అందజేస్తున్నారు. ...

Read More »

కామారెడ్డి బిజెపి కార్యకర్తల‌ రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డితో పాటు 30 మంది రక్త దానం చేశారు. ఈ సందర్బంగా రమణ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరుముకొస్తున్న వేళ ప్రజలు సహనంతో ఉండాల‌ని మే 3వ తేదీ వరకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా వ్యాప్తి చెందకుండా ఇంటి వద్దనే ...

Read More »

మాతా శిశు మరణాలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది చూడాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేసుకున్నవారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల‌ గురించి వైద్య సిబ్బంది వివరించాల‌ని సూచించారు. చిన్నారుల‌కు వ్యాధి నిరోధక టీకాలు ...

Read More »

ఇందూరు ఆర్యసమాజం ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు ఆర్యసమాజం ఆధ్వర్యంలో పేదల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్టు అధ్యక్షుడు దుడుక రామలింగం పేర్కొన్నారు. గురువారం ఉదయం నిజామాబాద్‌ ఆర్యసమాజ మందిరంలో పలువురు పేదల‌కుల నిత్యవసర సరుకుల‌తో కూడిన బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్యసమాజ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

19న తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 19న మద్యాహ్నం 2.30 గంటల‌కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్ అమలు తదితర అంశాల‌పై సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమల‌వుతున్న లాక్‌ డౌన్‌ మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్‌ 20 తర్వాత ...

Read More »

19న మహా రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న (కోవిడ్‌-19) కరొనా వైరస్‌ కారణంగా దేశంలో, రాష్ట్రంలో అనేకమంది బాధితులు అటు ప్రభుత్వ ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంకులో రక్తం నిలులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్‌ మహమ్మరిని తరిమికొట్టడంలో భారతీయులుగా రాజకీయాల‌కు అతీతంగా అందరూ ఏకం కావల‌సిన అవసరం ఉందని ఏబివిపి విభాగ్‌ ప్రముఖ్‌ రెంజర్ల నరేశ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ దేశ హితంకోసం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఏబీవీపీ దేశవ్యాప్త ...

Read More »

47 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 47 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 44 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 1, ఫోర్ వీల‌ర్స్‌ 2, ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »