Breaking News

Daily Archives: April 18, 2020

గృహ నిర్బంధంలో లేకపోతే డిఎస్‌పికి తెలపాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అన్ని వర్గాల‌ ప్రజలు సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బాన్సువాడ ఎంపీడీవో కార్యాల‌యంలో శనివారం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల‌, రాష్ట్రాల‌, జిల్లాల‌ నుంచి వచ్చిన వ్యక్తుల‌ను గృహనిర్బంధంలో ఏప్రిల్‌ 28 వరకు ఉంచాల‌ని సూచించారు. వైద్య సిబ్బంది ప్రతినిత్యం ఇంటింటా పర్యవేక్షణ చేయాల‌ని కోరారు. గృహనిర్బంధంలో ఇతర దేశాల‌ నుంచి వచ్చిన వ్యక్తులు లేకపోతే వారి సమాచారం ఆర్‌డిఓ, డిఎస్‌పికి తెలియజేయాల‌ని పేర్కొన్నారు. ...

Read More »

మానస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వల‌స కార్మికుల‌కు నిత్యవసర సరుకులు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి పిలుపు మేరకు మానస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల‌ నుండి ఆర్మూర్‌ లో పనుల‌ కొరకు వచ్చిన వల‌స కార్మికుల‌కు, అలాగే రేషన్‌ కార్డు లేనటువంటి నిరుపేదలైన రెండు వందల‌ పైచిలుకు కుటుంబాల‌కు నిత్యవసర సరుకులు గోధుమపిండి, ఉప్మా రవ్వ, బియ్యం, పప్పు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌, సంస్థ వ్యవస్థాపకులు మానస గణేష్‌, ...

Read More »

దుబాయ్‌ ఏజెంట్ల రూ. 3.5 ల‌క్షల‌ విరాళం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబాయ్‌ ఏజెంట్లు డీకంపల్లి పోశెట్టి, స్వామి, అశోక్‌, రమేష్‌ వినాయకరావు, తదితరులు కలిసి కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి 3 ల‌క్షల‌ 50 వేల‌ రూపాయల‌ చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం అందజేశారు.

Read More »

మందులు కొనుగోలు చేసిన వారి వివరాలు పంపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెడికల్‌ షాపు యజమానులు వాట్సాప్‌ ద్వారా జిల్లా డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌కు ప్రతిరోజు సాయంత్రం మెడికల్‌ షాప్‌ నుంచి దగ్గు, జ్వరం, గొంతు నొప్పికి సంబంధించి టాబ్లెట్‌లు కొనుగోలు చేసిన వారి వివరాలు పంపాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ కోరారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో శనివారం మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మెడికల్‌ షాపుల‌ ద్వారా ట్యాబ్లెట్లు కొనుగోలు చేసే వారి ...

Read More »

వంద శాతం నో మూమెంట్ అమలు జరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటైన్మెంట్‌ జోన్‌లో 100 శాతం నో మూమెంట్ అమలు జరగాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి మైనార్టీ ప్రజా ప్రతినిధుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ‌ల్ల‌ ఇప్పటికిప్పుడు ఎక్కువ మరణాలు జరగలేదు కాని పరిస్థితి విషమించితే అందుకనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవల‌సి వస్తుందని ప్రజల‌ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించాల‌ని ...

Read More »

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ట్రస్మా, ఒలంపిక్‌ అసోసియేషన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ ఆదేశాల‌ మేరకు నిరుపేదల‌కు, వల‌స కూలీల‌కు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం పదిహేను రోజుల‌కు సరిపడా బియ్యం, కూరగాయలు, ఉప్పు, కారం, పప్పు, పసుపు వంట సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడీల‌ శ్రీ రాములు, ట్రస్మా అధ్యక్షుడు జయసింహ గౌడ్‌ మాట్లాడుతూ మార్చి 23వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోన కట్టడికి జారీచేసిన లాక్‌ ...

Read More »

ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనుల‌ను పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో శనివారం పంచాయతీ కార్యదర్శుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పూడికతీత పనులు, ఫీడర్‌ చానల్‌, ఇంకుడు గుంతల‌ నిర్మాణం చేపట్టాల‌ని సూచించారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల‌ను 100 శాతం బతికే విధంగా సంరక్షణ చేపట్టాల‌ని కోరారు. గ్రామాల్లో జాబ్‌ కార్డ్‌ ఉన్న ...

Read More »

130 లీటర్ల కల్తీక‌ల్లు స్వాధీనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటోలో కూరగాయల‌ బుట్టల్లో తరలిస్తున్న 130 లీటర్ల కల్తీ క‌ల్లు ప్యాకెట్లను శనివారం తెల్ల‌వారుజామున ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సిబ్బంది పట్టుకున్నారు. ఎంఫోర్సుమెంట్‌ ఇంచార్జి సి.ఐ జగన్‌ మోహన్‌ కథనం ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి 130 లీటర్ల కల్తీక‌ల్లు పట్టుకున్నామన్నారు. శనివారం తెల్ల‌వారుజామున తన సిబ్బందితో కలిసి చిన్న మల్కాపూర్‌ గ్రామం వద్ద టిఎస్‌ 16 యుబి 1927 నంబర్‌ ఆటోలో కూరగాయల‌ బుట్టల్లో 130 లీటర్ల కల్తీక‌ల్లు ...

Read More »

ర్యాండమ్‌ రక్త నమూనాలు సేకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని కంటేన్మెంట్‌ జోన్‌ ప్రాంతాల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. పెద్ద బజార్‌లోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఏర్పాటుచేసిన జీరో టచ్‌ వాష్‌ బేషన్‌ను పరిశీలించారు. దుబ్బ, మాల‌పల్లి ప్రాంతాలు పర్యటించారు. మెడికల్‌ సిబ్బందితో మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు చేశారు. హొమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిని రోజు కరోనా వైరస్ ల‌క్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించి తెలుసుకోవాల‌న్నారు ర్యాండమ్‌ రక్త నమూనాలు సేకరించాల‌ని ...

Read More »

సిఎం గారు న్యాయవాదుల‌ను ఆదుకోండి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ల‌క్ష్మణ్‌రావు కామారెడ్డి న్యాయవాదుల‌ తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పలు విషయాల‌ను తెలియజేశారు. లేఖలో పేర్కొన్న వాస్తవాల‌ను సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. మన రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల‌లో సుమారు 35 వేల‌ మంది న్యాయవాదులు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రస్తుత లాక్‌ డౌన్‌, కోర్టు మూసివేత నోటి ఉనికికి దారితీసే వేలాది మంది న్యాయవాదుల‌ జీవనోపాధిని ప్రభావితం చేసింది. వారి సంపాదన రోజువారీ ప్రాతిపదికన ఉంది. ...

Read More »

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గూగుల్‌ తండాలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచనల‌ మేరకు గ్రామ రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌ అధికారుల‌కు, ప్రజాప్రతినిధుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసినట్టు రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు ల‌క్కాకుల‌ నరేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ ప్రజల‌ను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రజలందరూ ...

Read More »

నిజాంసాగర్‌లో గుర్తుతెలియని శవం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని ప్రాజెక్టులో శనివారం గుర్తుతెలియని శవం ల‌భ్యమైందని ఎస్‌ఐ సాయన్న తెలిపారు. ఎస్‌ఐ సాయన్న కథనం ప్రకారం పురుషుడు వయస్సు (45) ఉంటుందని అన్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సివుందని, ఇది హత్యన, ఆత్మహత్యన. ప్రమాదవశాత్తు పడిపోయాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సాయన్న పరిశీలించారు.

Read More »

అంగన్‌వాడి ఆధ్వర్యంలో నిరాశ్రయుల‌కు నిత్యవసరాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని లింగపూర్‌ గ్రామానికి చెందిన నాలుగు అంగన్‌వాడి కేంద్రాల‌ ఆధ్వర్యంలో శనివారం గ్రామశివారులోని ఎస్‌.పి.ఆర్‌ స్కూల్‌ ప్రాంతంలో నిరాశ్రయుల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఆయుర్వేద మందులు విక్రయించే మహారాష్ట్రకు చెందిన నిరాశ్రయుల‌కు బాలామృతం, బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లతో పాటు ప్రతి వ్యక్తికి మాస్కులు ఇచ్చి, పిల్ల‌ల‌కు కట్టారు. కరోనా ప్రభావంతో ఆకలితో అల‌మటిస్తున్న వారిని ఆదుకున్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్లు వైద్య క‌ల్ప‌న, వి.ఉమారని, టి.పద్మ, జి.ల‌లిత ...

Read More »

119 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 119 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 115 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 3, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శుక్రవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

సామాజిక మాధ్యమాల‌పై నిఘా పటిష్టం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ మానవాళికి ప్రాణాంతకంగా మారిందని, వైరస్‌ స్త్రీలు, పురుషులు, పిల్ల‌లు, వృద్దుల‌కు అన్ని వయసుల‌ వారిపై ప్రభావం చూపుతుందని కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వం తెలిపిన సూచనలు పాటించాల‌ని తెలిపారు. అదేవిధంగా తమను తమ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. ఇటీవల‌ సామాజిక మాద్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కరోనా వైరస్‌కు ...

Read More »

ఫ్లాష్‌… ఫ్లాష్‌.. తృటిలో తప్పిన అగ్నిప్రమాదం

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలోని బింధర్‌ విట్టలేశ్వరుని ఆల‌యంలో శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల‌కు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆల‌యంలోని ఒక గదిలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పొగరావడంతో ఆల‌య వెనక ఇంటి వారు గమనించి అగ్ని మాపక కార్యాల‌యానికి ఫోన్‌ చేయడంతో వెంటనే వచ్చి మంటలు ఆర్పి వేశారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది విద్యుత్‌ నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక పోలీసులు సంఘన స్థలాన్ని పరిశీలించి ...

Read More »