Breaking News

Daily Archives: April 19, 2020

7 వేల‌ 655 వల‌స కూలీల‌కు సహాయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొత్తగా 7655 మంది వల‌స కూలీల‌కు సహాయం అందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ప్రకటన విడుదల‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు గతంలో 11 వే 61 మంది వల‌స కూలీల‌కు ప్రతి ఒక్కరికి 12 కిలోల‌ బియ్యం 500 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇంకా 7 వేల‌ 655 మంది వల‌స కూలీల‌ను ...

Read More »

ఆసుపత్రుల‌ లాగా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల‌ నిర్వహణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన కుటుంబ సభ్యుల‌కు ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాల‌లో ఆసుపత్రుల్లో ఏ రకమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటారో అవన్నీ కూడా తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా భవనాల‌ను గుర్తించడంతో పాటు ప్రతి ఒక్కరికి వేరువేరుగా గదులు ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా వారిలో ఎవరికైనా వ్యాధి వ్యాప్తి చెంది ఉంటే అక్కడే ఉండే ఇతరుల‌కు వైరస్‌ సంక్రమించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు ...

Read More »

కొనుగోలు కేంద్రాల‌ వద్ద సామాజిక దూరం పాటించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంగంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదివారం పరిశీలించారు. క్రమపద్ధతిలో ధాన్యం కోతల‌కు ఏఈఓలు అనుమతి పత్రాలు ఇవ్వాల‌ని సూచించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని పేర్కొన్నారు. ధాన్యాన్ని తేమశాతం చూసే విధానాన్ని పరిశీలించారు. రైతులు కేంద్రాల‌ వద్ద సామాజిక దూరం పాటించే విధంగా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కేంద్రాల‌ వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాల‌ని సూచించారు. వచ్చేవారం ధాన్యం కొనుగోలు వేగవంతం అవుతాయని రైతులు ...

Read More »

జర్నలిస్టుల‌కు శానిటైజర్‌ల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలో ఆదివారం డిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిజాంసాగర్‌ జర్నలిస్టుల‌కు ఉచితంగా శానిటైజర్‌, మాస్కుల‌ను పంపిణీ చేశారు. చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టల సేలు మరవలేనివని కొనియాడారు. అంతేకాక ఎటువంటి జీతాలు లేకుండా సమాజ సేవకే అంకితమయ్యే జర్నలిస్టులు అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. మాస్కులు, శానిటైజర్‌తో పాటు జర్నలిస్టుల చిన్న చిన్న ఖర్చుల‌కు ...

Read More »

బాన్సువాడలో 4 బైక్‌లు సీజ్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలోని క్వారంటీన్‌ హాట్‌ స్పాట్‌ టీచర్స్ కాల‌నీ, మదీనకాల‌ని, తాడుకోల్‌ చౌరస్తా, అంబెడ్కర్‌ చౌరస్తా, పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తాలో డిఎస్పి దామోదర్‌ రెడ్డి పర్యటించి కాల‌నీ వాసులు ఎవరు ఇళ్లు విడిచి బయటకు రావద్దని, ప్రభుత్వ సూచనలు పాటించి సహకరించాల‌ని ప్రజల‌కు విజ్ఞప్తి చేసారు. రోడ్డుపై బైకుమీద ఇద్దరూ, ముగ్గురు ప్రయాణించడంతో వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు 4 బైకుల‌ను సీజ్‌ చేశారు. సిఐలు మహేష్‌, టాటా బాబు, ...

Read More »

చలి పిడుగు పడి ఎడ్లు మృతి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌ మండలం మంగళూరు గ్రామ శివారులో సర్వే నంబర్‌ 264 లో ఆదివారం ఉదయం సుమారు 8.30 గంటల‌కు చలి పిడుగు పడి నయాకుని రాములు, తండ్రి భూమయ్యకు చెందిన రెండు ఎడ్లు చనిపోవడం జరిగింది. ఎడ్ల విలువ‌ సుమారు 80 వేల‌ వరకు ఉంటాయని చెప్పారు. వ్యవసాయానికి ఆధారమైన ఎడ్లు చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. నష్టపరిహారం అందించాల‌ని వేడుకుంటున్నారు.

Read More »

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండల‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాల‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌.ఐ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిజామాబాద్‌ నుండి వర్ని మండలానికి అక్రమంగా మద్యం తరిలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మల్కాపూర్‌ వద్ద సిబ్బందితో కలిసి మద్యం తరలిస్తున్న వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తుల‌ను పట్టకున్నామని అన్నారు. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యం దుకాణాలు బంద్‌ ఉండడంతో వెంకటేశ్వర ...

Read More »

విద్యార్థుల‌కు పోలీసుల‌ చేయూత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత చదువుల‌ నిమిత్తం ఇటలీలో విద్యను అభ్యసిస్తున్న 20 మంది విద్యార్థుల‌కు నిజామాబాద్‌ పోలీసులు చేయూత అందించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన 20 మంది విద్యార్థులు ఇటలీలో విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో స్వదేశానికి తిరుగు ప్రయాణం పట్టడంలో ప్రతి ఒక్క చెక్‌ పోస్ట్‌ వద్ద అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న క్రమంలో నిజామాబాద్‌ అదనపు డి.సి.పి ఉష విశ్వనాథన్‌ ఆదేశాల‌ మేరకు 3వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో సంతోష్‌ కుమార్‌ ...

Read More »