Breaking News

Daily Archives: April 22, 2020

401 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 401 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 367, ఆటోలు 8, ఫోర్ వీల‌ర్స్‌ 26 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

సౌదీలో గుండె పోటుతో మరణించిన కుటుంబానికి సహాయం

కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియాలో క్యాసంపల్లి తండాకు చెందిన పిపావత్‌ సేవ్య గత 8 సంవత్సరాల‌నుండి హౌస్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఏప్రిల్‌ 11 న గుండె పోటుతో మరణించాడు. ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న కుటుంబానికి తండా యువకులు 175 కిలోల‌ బియ్యం సేకరించి అందించారు. ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లి ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేస్తామని మనోధైర్యం ఇచ్చారు. కార్యక్రమంలో రూప్‌ సింగ్‌, కరణ్‌, శ్రీను, ధర్‌ సింగ్‌, కిషన్‌, హుస్సేన్‌, ...

Read More »

మాస్కు ధరించకుంటే జరిమానా విధించారు…

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వ్యక్తికి పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప వంద రూపాయల‌ జరిమానా విధించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళితే తప్పకుండా మాస్కు ధరించాల‌ని ప్రభుత్వం ఇదివరకే తెలియజేసిందన్నారు. కానీ కొందరు మాస్కు ధరించకుండా బయట తిరుగుతున్నారని, అటువంటి వారికి 100 నుంచి 500 రూపాయల‌ వరకు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.

Read More »

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల‌ను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర ల‌భిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. రైతులు దళారుల‌ను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కేంద్రాల‌ వద్ద రైతులు సామాజిక దూరం పాటించాల‌ని పేర్కొన్నారు.

Read More »

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర అంతిమ ప్రయాణం స్మశానం చేరికతో ముగుస్తుంది. నా అనుకున్న నలుగురి సమక్షంలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల నిర్వహణ జరుగుతది. కానీ ప్రస్తుత కరోనా కాలంలో ఎంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నామో తెలిసిందే. ఇటువంటి విషాదమే తెలంగాణవాసికి ఎదురైంది. నిజామాబాద్‌వాసి మహమ్మద్‌ అజ్మతుల్లా సౌదీలోని మక్కాలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చేరగా కరోనా వైరస్‌ భారిన ...

Read More »

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే క్షేమంగా ఉంటామని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి గ్రామస్థాయి, మున్సిపల్‌ స్థాయి ప్రజాప్రతినిధుల‌కు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధుల‌తో మాట్లాడుతూ మహమ్మారి వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ మే 7వ తేదీ వరకు పొడిగించారని తమ పరిధిలోని ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా అసలు ...

Read More »

ఆర్‌ఎంపి, పిఎంపిలు వైద్యం చేయరాదు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ బుధవారం ఆరోగ్య సేవల‌ను సమీక్షించారు. కరోనా కట్టడి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవాల‌ని, అందరికి ఆరోగ్య సేలు అందించాల‌ని వైద్య అధికారుల‌కు, ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్య శాఖలో నమోదైన వారు తమ సేలు అందించాల‌ని, తమ ఆసుపత్రికి జ్వరం, జలుబు, దగ్గు ల‌క్షణాలున్న వారు వస్తే వివరాలు కోవిడ్‌ కంట్రోల్‌ రూంకు తెలియజేయాల‌న్నారు. 7382928649, 7382929356 నెంబర్‌కు తెలియజేయాల‌ని పేర్కొన్నారు. ...

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో బుధవారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి, బాన్సువాడకంటోన్మెంట్‌ ఏరియాలో ప్రజల‌ను బయటకు వెళ్లనివ్వకూడదని, సంచార వాహనాల‌ ద్వారా వారికి నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందించాల‌ని పేర్కొన్నారు. రంజాన్‌ సందర్భంగా ముస్లిరలు ప్రార్థనలు చేయడానికి మసీదుకు వెళ్లవద్దని, కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల‌ని కోరారు. లాకుడౌను అమల్లో ఉన్నందున కాల‌నీలోకి సంచార ...

Read More »

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల‌ మేరకు గాయత్రి షుగర్స్‌ వారి సహకారంతో తహసీల్‌ కార్యాల‌య ఆవరణలో 47వ వార్డులో నివసిస్తూ రేషన్‌ కార్డు లేని ఏడుగురికి కిరాణా సామాన్లు (కిరాణా కిట్టు) అందజేశారు.

Read More »

సహకార సంఘాల‌కు తూకం యంత్రాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేతుల‌ మీదుగా గ్రామంలో నిరుపేదల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం భిక్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అవరణలో బస్వాపూర్‌, బిబిపెట్‌ సహకార సంఘాల‌కు ధాన్యం తూకం వేసే యంత్రాలు, టార్పాలిన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అందరు ఇంట్లోనే ఉండి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాల‌న్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్డడి చేయాల‌ని ...

Read More »

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న మాస్కుల‌ను ధరించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో (సోషల్‌ మీడియాలో) పెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుందామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ కార్యకర్తల‌కు ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చారు. దయచేసి కార్యకర్తలు మాస్క్‌లు పంపిణీ చేసేటప్పుడు గుంపుగా కాకుండా దూరంగా (సామాజిక దూరం) ఉండి పంచాల‌ని విజ్ఞప్తి చేశారు.

Read More »

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ఆశీర్వాదంతో, శ్రీ ఉత్తరాది మఠానికి చెందిన ప్రతినిధులు రెండ్రోజుల‌ నుండి లాక్‌ డౌన్‌ బాధితుల‌కు ఆహార పంపిణీ (పులిహోరా) చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం వైద్య సిబ్బంది, రెవెన్యూ, మునిసిపల్‌ సిబ్బందికి లింబాద్రి ల‌క్ష్మీ నరసింహ స్వామి ఆల‌యం తరపున 125 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా సామాజిక దూరం పాటిస్తు తమ వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ 300 ...

Read More »

తస్మాత్‌ జాగ్రత్త…

దేవునికి షట గోపం (పంగనామాలు) పెట్టిన భూ బకాసురులు… కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్‌ నుండి బస్టాండ్‌ వరకు రొడ్డకు ఎడమ వైపున మొదలుకొని బిసి కాల‌నీ, ప్రియ టాకీస్‌ 1 ఎకరం 10 గుంటతో పాటు రాందాస్‌ బావి, బావి చుట్టు పక్కల‌ పరిసర ప్రాంతము, ఎర్రమన్ను కుచ్చా ఆంజనేయ స్వామి గుడి నుండి వెంచర్ల వరకు పన్నాలాల్‌ కుటుంబానికి సంబందించిన బద్రి బిషాల్‌ పిట్టి అనే మార్వాడీ వ్యాపారికి ...

Read More »

ఎల్లారెడ్డిలో ఆటోడ్రైవర్లకు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆటో డ్రైవర్లకు నిత్యవసర సరుకులు పంపిణి చేశారు. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆటోవాలాలు దినసరి ఆదాయం కోల్పోయారని, వారిని ఆదుకోవడం మన భాద్యత అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పల్లె గంగన్న, పార్టీ నాయకులు ప్రతాప్‌ రెడ్డి, ఎల్లారెడ్డి కౌన్సిల‌ర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Read More »

పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు. ఎందుకని?

జవాబు: అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో ...

Read More »