Breaking News

సహకార సంఘాల‌కు తూకం యంత్రాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేతుల‌ మీదుగా గ్రామంలో నిరుపేదల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అనంతరం భిక్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అవరణలో బస్వాపూర్‌, బిబిపెట్‌ సహకార సంఘాల‌కు ధాన్యం తూకం వేసే యంత్రాలు, టార్పాలిన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అందరు ఇంట్లోనే ఉండి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాల‌న్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్డడి చేయాల‌ని ఎమ్మెల్యే అన్నారు.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article