Breaking News

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ఆశీర్వాదంతో, శ్రీ ఉత్తరాది మఠానికి చెందిన ప్రతినిధులు రెండ్రోజుల‌ నుండి లాక్‌ డౌన్‌ బాధితుల‌కు ఆహార పంపిణీ (పులిహోరా) చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం వైద్య సిబ్బంది, రెవెన్యూ, మునిసిపల్‌ సిబ్బందికి లింబాద్రి ల‌క్ష్మీ నరసింహ స్వామి ఆల‌యం తరపున 125 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.

కరోనా కట్టడిలో భాగంగా సామాజిక దూరం పాటిస్తు తమ వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ 300 ఆహార ప్యాకెట్లు వితరణ చేసినట్లు తెలిపారు. బుధవారం బీమ్‌గల్‌ పట్టణం, పురాణిపేట్‌, రామన్నపేట్‌లో వితరణ చేశారు. కాగా లాక్‌ డౌన్‌ ముగిసే వరకు ఆల‌యం తరఫున ఆహార పంపిణీ కొనసాగించనున్నట్టు తెలిపారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article