Breaking News

Daily Archives: April 23, 2020

జగిత్యాల‌లో శాంతికమిటీ సమావేశం

జగిత్యా, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ఉన్నందున రంజాన్‌ పండుగ సందర్భంగా తీసుకోవల‌సిన ముందు జాగ్రత్తల‌పై కలెక్టర్‌ చాంబర్‌లో ముస్లిం పెద్దల‌తో జిల్లా కలెక్టర్‌ జి.రవి, ఎస్పీ సింధూశర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల‌ ప్రకారం లాక్‌ డౌన్‌ మే 7వ తేదీ వరకు ఉందని, రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నందున సామూహికంగా ప్రజలు ఒకే దగ్గర గుమిగూడి ఉండకుండా చూడాల‌న్నారు. గతంలో జరిగిన పండుగల‌లో క్రిస్టమస్‌, శ్రీరామనవమి, హనుమాన్‌ ...

Read More »

పిపిఈ కిట్‌లు, మాస్కులు అందజేసిన పూర్వ విద్యార్థులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ హై స్కూల్‌ లో పూర్వ విద్యార్థులు వారి ట్రస్ట్‌ తరఫున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, డాక్టర్‌ ఎ.వి. శ్రీనివాస్‌కు 100 పిపిఈ కిట్లను అందజేశారు. వీటితోపాటు వారి సిబ్బంది కొరకు రెండు వేల‌ మాస్కుల‌ను అందచేశారు. అనంతరం డిఎస్‌పి ల‌క్ష్మి నారాయణ, సి.ఐ. జగదీష్‌కు పోలీసు సిబ్బంది కోసం 500 మాస్కులు ప్రస్తుతానికి కొన్ని పీపీఈ కిట్లను యిస్తూ త్వరలో మరికొన్ని ...

Read More »

సరిహద్దు చెక్‌పోస్టు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర మద్నూరు సరిహద్దు చెక్‌ పోస్టును గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. ఇతర రాష్ట్రాల‌ ప్రజల‌ను మన జిల్లాలోకి ఎవరిని రానివ్వద్దని సూచించారు. మన జిల్లా వాసులు సరిహద్దు దాటి పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లవద్దని పేర్కొన్నారు. కుర్ల లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆరబెట్టిన, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సిర్పూర్‌, చిన్న టాక్లి, పెద్ద టాక్లి గ్రామాల‌ను సందర్శించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయనే ...

Read More »

వ్యవసాయ ఉత్పత్తుల‌ కొనుగోలుకు రూ. 30 వేల‌ కోట్లు

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండల‌ కేంద్రం, కోటగిరి మండలంలోని పోతంగల్‌, కోటగిరి, రాయకూర్‌ గ్రామాల‌లో సన్‌ ఫ్లవర్‌ గింజల‌ కొనుగోలు కేంద్రాల‌ను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. స్పీకర్‌ వెంట ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఉన్నారు. వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘాల‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల‌లో ప్రభుత్వ మద్దతు ధరతో రైతుల‌ నుండి నేరుగా సన్‌ ఫ్లవర్‌ ...

Read More »

1600 మందికి రోజు అన్నం పెట్టడం అభినందనీయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటోన్మెంట్‌ క్లస్టర్లలో పనిచేస్తున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీగాల‌ గణేష్‌ గుప్తా ఆధ్వర్యంలో అర్వపల్లి పురుషోత్తం గుప్తా ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో కరోనా వైరస్‌ కంటెన్మెంట్‌ క్లస్టర్‌లో పనిచేస్తున్న పోలీస్‌ సిబ్బందికి, శానిటేషన్‌ సిబ్బందికి, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, ఆశ వర్కర్లకు, రెవెన్యూ సిబ్బందికి మీడియా మిత్రుల‌కు 1600 వందల‌ మందికి పంపిణీ చేయటానికి ఏర్పాటు చేస్తున్న గిఫ్ట్ ల‌ను సిద్ధం చేస్తున్న ఫంక్షన్‌ ...

Read More »

టోకెన్‌ ఇచ్చిన తేదీ ప్రకారం ధాన్యం తేవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఏ రోజు టోకెన్‌ ఇస్తే ఆ రోజే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. గుండారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ సందర్శించారు.   ఈ సందర్భంగా రైతుల‌తో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ జాగ్రత్తల‌కు ప్రాధాన్యత ఇవ్వాల‌ని సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌ని, తప్పనిసరి మాస్కు ధరించాల‌ని, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావడానికి ఏ రోజు టోకెన్‌ ఇస్తే ఆ రోజు ...

Read More »

విస్తృత సేవా కార్యక్రమాల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల‌కు వల‌స కూలీల‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నిత్యావసర సరుకులు అందిస్తుందని, ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు రావద్దని పిఎసి చైర్మన్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్మూరు ప్రజల‌ను ఉద్దేశించి మాట్లాడారు.. ఆర్మూర్‌ నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించి కరోనా కట్టడి చర్యల‌ను, సేవా కార్యక్రమాల‌ను పరిశీలించారు. పట్టణంలోని ఎంఆర్‌ గార్డెన్‌ లో వల‌స కూలీల‌కు నిత్యావసర సరుకుల‌తో పాటు బియ్యం ...

Read More »

పిపిఇ కిట్‌ కోసం ఎంపి రూ.2.10 ల‌క్షల‌ విరాళం

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జహీరాబాద్‌ బి.బి.పాటిల్‌ గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా తదితర ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి తన వంతు సహాయంగా రెండు ల‌క్షల‌ 10 వేల‌ రూపాయల విలువగల వ్యక్తిగత పరిరక్షణ పరికరాల‌ను (పిపిఇ కిట్‌లు) అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ వైద్యులు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని, వైద్యులు, వైద్య సిబ్బందిని కరోన బారిన పడకుండా పరికరాలు కాపాడతాయన్నారు. కరోనా పీడితుల‌కు వైద్య సేవలందిస్తున్న వైద్యుల‌ను ఎంపి ప్రశంసించారు. కార్యక్రమంలో ఆయా ఆసుపత్రుల‌ ...

Read More »

దివ్యాంగుల‌కు మాస్కులు, నిత్యవసరాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌ ప్రాంతంలో కరోనా వ‌ల్ల‌ ఇబ్బందులు పడుతున్న దివ్యాంగుల‌కు అంగన్‌వాడి అధికారులు, టీచర్‌లు మాస్కులు, నిత్యావసర వస్తువులు అందించారు. కార్యక్రమంలో కామారెడ్డి ప్రాజెక్ట్‌ ఐ.సి.డి.ఎస్‌ అధికారిణి శ్రీల‌త, దేవనపల్లి సెక్టార్‌ సూపర్‌వైజర్‌ నాగమణి, లింగపూర్‌ గ్రామ అంగన్‌వాడి టీచర్‌ వైద్య ఉమారాణి సొంత ఖర్చుతో అందించారు. వికలాంగులు వారిని అభినందించారు.

Read More »

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గిద్ద గ్రామంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచన మేరకు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌ అధికారుల‌కు, ఆశ కార్యకర్తల‌కు, ప్రజా ప్రతినిధుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసినట్టు రామారెడ్డి మండల అధ్యక్షుడుల ల‌క్కాకుల‌ నరేష్‌ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడిలో భాగంగా అధికారుల సేవ‌లు మరువలేనివి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ...

Read More »

శ్రీనింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్ధానం తరఫున భోజనం పంపిణీ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగత్‌ గురువులైనటువంటి శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదుల‌వారి మంత్రాక్షతల‌ ఆశీర్వాదముతో శ్రీనింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరఫున కరోనా బాధితుల‌కు, సేవకుల‌కు భోజనం పంపిణీ చేశారు. కరోనా వ్యాధి కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల‌కు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖల‌కు గురువారం అన్నదానం చేశారు. భీంగల్‌ పరిసర ప్రాంతాల‌తో పాటు ...

Read More »

ఎల్లారెడ్డిలో శాంతి కమిటీ సమావేశం

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఎల్లారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. లాక్‌ డౌన్‌లో భాగంగా రంజాన్‌ సందర్బంగా శాంతి కమిటీ సమావేశంలో మత పెద్దల‌కు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, డీఎస్‌పి, సిఐ, ఎస్‌ఐ, తహసీల్దార్‌ స్వామి, మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, కౌన్సిల‌ర్లు బుంగారి రాము, జంగం నీల‌ కంఠం, ఎరుక సాయిలు, ఇమ్రాన్‌, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Read More »

సేవాభారతి, ఏబివిపి ఆధ్వర్యంలో పేదల‌కు కూరగాయల‌ వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపధ్యంలో కామారెడ్డి సేవ భారతి ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం పేదల‌కు నిత్యవసర సరుకులు, కూరగాయలు వితరణ చేశారు. పేదలు పనిలేక ఆకలితో అమటిస్తున్న వారికి తమవంతుగా సహాయం చేసినట్లు సేవ భారతి, ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రణజిత్‌ మోహన్‌, నంది ప్రవీణ్‌, నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

లాక్‌ డౌన్‌ పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ప్రజల‌ కష్టసుఖాల‌ను తెలుసుకోవడానికి బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధుల‌తో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి, కాల‌నీలో స్పీకర్‌ పర్యటించారు.   ఈ సందర్భంగా కాల‌నీలో స్పీకర్‌ మాట్లాడుతూ సమర్ధవంతమైన చర్యల‌తో ...

Read More »

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఏసిఎస్‌ ఛైర్మన్‌

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం హాజిపూర్‌ తండా గ్రామపంచాయతీలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎగుల‌ నర్శింలు, సర్పంచ్‌ చాందీబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద రైతు భౌతిక దూరం పాటించాల‌ని, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల‌ని పేర్కొన్నారు. రైతుల‌ వద్దనుంచి టోకెన్‌ పద్దతిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ...

Read More »

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి పోషక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాణి మాట్లాడుతూ గర్భిణీల‌కు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల‌ని చెప్పారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల‌ని, ఒక వేళ బయటకు వెళ్తే మాస్కు తప్పనిసరిగా ధరించాల‌ని ఎంపిటిసి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు ...

Read More »

పారిశుద్య కార్మికుల‌ను సన్మానించిన జాగృతి రాష్ట్ర నాయకులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు నరాల‌ సుధాకర్‌ గురువారం పారిశుద్ధ్య కార్మికుల‌ను సన్మానించి నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వివిలాడిస్తుంటే ఏ మాత్రం భయపడకుండా పనిచేస్తున్నది ముగ్గురే ముగ్గురని అన్నారు. వారు డాక్టర్లు, పోలీసు అయితే మూడవ సింహం లాంటి వారు పారిశుధ్య కార్మికులు అని నరాల‌ సుధాకర్‌ పేర్కొన్నారు. గత నెల‌ రోజులుగా దేశమంతా కరోనా బారినపడి లాక్‌ డౌన్‌లో ఉండిపోయిందని, కాని ఎటువంటి అంటువ్యాధులు ప్రబల‌కుండా యుద్ధం ...

Read More »

ఆర్మూర్‌ హనుమాన్ ఆల‌య కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు గురువారం జర్నలిస్ట్ కాల‌నీ హనుమాన్ ఆల‌యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఎల్‌టి కుమార్‌ శోభారాణి, శ్రీదేవి శేఖర్‌, సంధ్య అజయ్‌, రుచికరమైన వెజ్‌ బిర్యానీ మసాలా టమాట పప్పు భోజనం వండిరచి నిరుపేదల‌కు అందజేశారు. ఆర్మూర్‌లోని కొత్త బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ ప్రాంతం, ఆదిలాబాద్‌ వెళ్లే జాతీయ రహదారిపై ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆల‌య కమిటీ అధ్యక్షుడు పుప్పాల‌ శివరాజ్‌ ...

Read More »

అంబేడ్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో చపాతీలు, అన్నం పంపిణీ

బాల్కొండ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనతా గ్యారేజ్‌ అంబేద్కర్‌ యూత్‌ బాల్కొండ మండలం ఆధ్వర్యంలో గురువారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్ద గంగారెడ్డి చేతుల‌ మీదుగా ఐదు వందల‌ మంది వల‌సకూలీల‌కు చపాతీలు, అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనతా గ్యారేజ్‌ అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు, బొట్టు వెంకటేష్‌, తాళ్ల వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »