Breaking News

శ్రీనింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్ధానం తరఫున భోజనం పంపిణీ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగత్‌ గురువులైనటువంటి శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదుల‌వారి మంత్రాక్షతల‌ ఆశీర్వాదముతో శ్రీనింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరఫున కరోనా బాధితుల‌కు, సేవకుల‌కు భోజనం పంపిణీ చేశారు. కరోనా వ్యాధి కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల‌కు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖల‌కు గురువారం అన్నదానం చేశారు.

భీంగల్‌ పరిసర ప్రాంతాల‌తో పాటు జాగిర్యాల్‌, రామన్నపేట్‌, పురాణిపేట్‌, బెజ్జోర గ్రామాల‌కు దేవస్థానం నుండి మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నట్టు, ఇట్టి సేవల‌ను లాక్‌ డౌన్‌ ముగిసేవరకు కొనసాగిస్తామని ఆల‌య ధర్మకర్త నంబి.లింబాద్రి తెలియజేశారు.

Check Also

650 మందికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article