Breaking News

జగిత్యాల‌లో శాంతికమిటీ సమావేశం

జగిత్యా, ఏప్రిల్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ఉన్నందున రంజాన్‌ పండుగ సందర్భంగా తీసుకోవల‌సిన ముందు జాగ్రత్తల‌పై కలెక్టర్‌ చాంబర్‌లో ముస్లిం పెద్దల‌తో జిల్లా కలెక్టర్‌ జి.రవి, ఎస్పీ సింధూశర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల‌ ప్రకారం లాక్‌ డౌన్‌ మే 7వ తేదీ వరకు ఉందని, రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నందున సామూహికంగా ప్రజలు ఒకే దగ్గర గుమిగూడి ఉండకుండా చూడాల‌న్నారు.

గతంలో జరిగిన పండుగల‌లో క్రిస్టమస్‌, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి లాంటి పండుగల‌ను కూడా దేవాల‌యాల‌కు వెళ్లకుండా ఎవరి ఇంటిలోనే వారు చేసుకున్నారన్నారు. కాగా రంజాన్‌ మాసము ప్రారంభం అవుతున్నందున మీరందరూ మీ మీ ఇంటిలోనే ప్రార్థనలు చేసుకోవాల‌ని సూచించారు. ప్రార్ధన సమయంలో ఒకరికొకరు దూరంగా ఉండేట‌ట్లు చూసుకోవాల‌న్నారు. ఈ విషయాన్ని మిగిలిన ముస్లిం సోదరుల‌కు తెలియపరచాల‌ని అన్నారు.

ప్రస్తుతము ఉన్న ప్రభుత్వ నిబంధనల‌ ప్రకారం ఇఫ్తార్‌ విందు లాంటివి కూడా ఏమి చేయకూడదని చెప్పారు. మే 7 వ తేదీ తర్వాత ప్రభుత్వ నిబంధనల‌ ప్రకారం ప్రవర్తించాల‌ని, మీరందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాల‌ని అన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ ఉన్నందున జనతా కర్ఫ్యూ నుండి వచ్చిన పండుగల‌ను ఇంటి వరకే చేసుకున్నారని అదే స్పూర్తితో మీరు కూడా రంజాన్‌ మాసం ప్రారంభం అవుతున్నందున అదే విధంగా చేయాల‌ని అన్నారు.

మన జిల్లాలో ఇప్పటివరకూ అన్ని మతాల‌ వారు సహకరించారని జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు కూడా రాలేదని అదే స్ఫూర్తితో కొనసాగించాల‌ని ముస్లిం పెద్దల‌ను కోరారు. కార్యక్రమంలో మైనార్టీ అధికారి సుందర్‌ వరదరాజన్‌, డిపిఓ శేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్లు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

Check Also

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని ...

Comment on the article