Breaking News

Daily Archives: April 24, 2020

మాస్కు ధరించని వారికి రూ. 500 జరిమానా

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్కు ధరించని వారికి రూ.500 జరిమానా విధించాల‌నీ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో ఐకేపీ ఏపిఎం, ఎంపీవోల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల‌ ద్వారా మాస్క్‌ల‌ను తయారుచేయించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపట్టాల‌ని సూచించారు. ఉపాధి హామీ కూలీల‌కు ఒక్కొక్కరికి మూడు మాస్కుల‌ చొప్పున ఇవ్వాల‌ని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10, ఎల్లారెడ్డి, బాన్సువాడలో 5 చొప్పున ...

Read More »

కామారెడ్డిలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమల‌వుతోంది

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్కు ప్రతి ఒక్కరూ విధిగా ధరించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో అధికారుల‌తో దాన్యం కొనుగోలు, కరోనా వైరస్‌ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాంసం విక్రయించేవారు, కొనుగోలు దారులు గ్లౌజులు, మాస్కు ధరించాల‌ని సూచించారు. కామారెడ్డి జిల్లాలో లాక్‌ డౌన్ అమలు పకడ్బందీగా జరుగుతోందని చెప్పారు. ఉదయం 6 గంటల‌ నుంచి 11 వరకు ...

Read More »

మీరు లేనిదే కరోనా కట్టడి లేదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచం యావత్‌ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యవసర సేవలందిస్తూ, ఎంతో సాహసోపేతంగా కరోనాను తరిమికొట్టే విషయంలో ముందు వరుసలో ఉండి కొట్లాడిన వీఆర్‌ఏలు, ఆశవర్కర్లు, పోలీస్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా సేవ‌లు వెల‌కట్టలేనివని, చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అత్యవసర సేవలందిస్తున్న కింది స్థాయి సిబ్బంది, నిజామాబాద్‌ సిటీ మీడియా కలిపి 2వేల‌ మందికి రూ. ...

Read More »

అడ్డగోలుగా తరుగు తీస్తామంటే క్రిమినల్‌ కేసు, సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సును కోరి 30 వేల‌ కోట్ల రూపాయల‌ రుణాలు తెచ్చి 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోగా మిల్ల‌ర్లు తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని, అలాంటి వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాల‌ని రాష్ట్ర రహదారులు భవనముల‌ శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం మంత్రి నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ...

Read More »

టోల్‌ప్లాజా సిబ్బంది మాస్కులు, గ్లౌజ్‌లు తప్పక ధరించాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పర్యటనలో భాగంగా శుక్రవారం ఇందల్వాయి టోల్‌ ప్లాజా, గన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందల్వాయి టోల్‌ ప్లాజాలో పని చేసే ప్రతి వ్యక్తి మాస్కు, గ్లౌజులు ధరించాల‌ని, సానిటైజర్‌ వాడాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌ని అన్నారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య మీటర్‌ దూరం ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా టోల్‌ప్లాజా సిబ్బంది పని ...

Read More »

రాబోయే రోజుల్లో రెడ్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డికి మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత తరపున నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి 500 పిపిఈ కిట్లు, 2 వేల‌ క్లాత్‌ మాస్కులు శుక్రవారం కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ నియంత్రణలో ముందుండి ఆసుపత్రుల్లో, క్వారంటైన్‌ సెంటర్‌లో పనిచేసే వాళ్లకు చాలా ఉపయోగ పడతాయని స్టూడెంట్‌గా పని చేయడానికి వారికి ఎలాంటి అభద్రతాభావం లేకుండా ప్రొటెక్షన్‌ ఉంటుందన్నారు. క్లాత్‌ మాస్కు ...

Read More »

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు పరిశీలించిన కలెక్టర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పర్యటనలో భాగంగా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు పరిశీలించి పనులు చేస్తున్న కూలీల‌కు మాస్కులు పంచారు. ఈ సందర్భంగా కూలీల‌తో మాట్లాడి కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ను తప్పక పాటిస్తూ పనులు చేయాల‌న్నారు. కూలీలు పనులలో ఏ సమయం నుంచి పాల్గొంటారని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల‌ నుండి 11 గంటల‌ వరకు పని చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ...

Read More »

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదుల‌వారి ఆశీర్వాదముచే, శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరుపున లాక్‌ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల‌కు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖల‌కు ఆల‌యం తరఫున ఆహార పంపిణీ చేస్తున్నట్టు ఆల‌య ప్రతినిధులు తెలిపారు. భీంగల్‌ పరిసర ప్రాంతాల‌తో పాటు జాగిర్యాల్‌, రామన్నపేట్‌, పురాణిపేట్‌, బెజ్జోర గ్రామాల‌కు దేవస్థానం నుండి మధ్యాహ్న ...

Read More »

ఉపవాస దీక్షలో రమణారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల‌ని డిమాండ్‌ చేస్తూ రైతుల‌కు సంఫీుభావంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తన ఇంట్లోనే ఉదయం 10 గంటల‌ నుండి సాయంత్రం 5 వరకు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంట చేతికి వచ్చిందని పంట అమ్ముకోవడానికి రైతులు అష్ట ...

Read More »

దుకాణాల‌ వద్ద ధరల‌ పట్టిక ఏర్పాటు చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఎస్‌ఐ సుధాకర్‌ మండల‌ కేంద్రంలోని వ్యాపారస్తుల‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుకాణదారులు భౌతిక దూరం పాటించాల‌ని, దుకాణాల‌ ముందు ధరల‌ పట్టిక ఏర్పాటు చేయాల‌ని, వస్తువుల‌ను అధిక ధరల‌కు అమ్మ కూడదని పలు సూచనలు చేశారు. దుకాణదారులు ప్రతి దుకాణం ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. సమావేశంలో పాల్గొన్న వ్యాపారస్తుల‌కు యాదగిరి మెడికల్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చేతుల‌ మీదుగా ఉచితంగా ...

Read More »

వల‌స కార్మికుల‌కు ల‌యన్స్‌ క్లబ్‌ అన్నదానం

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ల‌యన్స్‌ క్లబ్‌ రామాయంపేట స్నేహ బందు ఆద్వర్యంలో శుక్రవారం జాతీయ రహదారి మీద కాలినడకన సొంత ఊర్లకు వెలుతున్న 150 మంది వల‌స కార్మికుల‌కు అన్న దానం చేశారు. ల‌యన్‌ కే శ్రీనివాసరావు జోన్‌ చైర్మన్‌, ల‌యన్‌ బి.గురవయ్య జిల్లా చైర్మన్‌, ల‌యన్‌ ఎం దీప్‌ చందు కోశాధికారి ఆర్థిక సహకారంతో అన్నదానం చేశారు. ల‌యన్‌ వి. దామోదర్‌ రావు అధ్యక్షుడు, ల‌యన్‌ ఐ. రవీందర్‌ గౌడ్‌, ఎం ...

Read More »

ఆల‌య పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలోని తెలంగాణ తిరుమల‌ దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల‌ను శుక్రవారం శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.

Read More »

తాలు పేరిట కోత పెట్టడం సరికాదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాల‌ని రైతుకు సంఫీుభావంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 10 గంటల‌ నుండి సాయంత్రం 5 గంటల‌ వరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా ల‌క్ష్మీ నర్సయ్య దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాల‌ని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌లో కొనుగోలు చేసే ధాన్యానికి తేమ, తాలు, తప్ప పేరిట రైస్ మిల్ల‌ర్లు కోత తీయరాదని, గన్నీబ్యాగులు, ...

Read More »

సకాలంలో పంట కొనుగోళ్లు చేపట్టాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులు పండిరచిన ధాన్యం సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులు, రైస్‌మిల్‌ యజమానుల‌కు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని, అదేవిధంగా వ్యాపారులు తరుగు పేరుతో 6 నుండి 10 కిలోల‌ వరకు తీయటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాల‌యంలో మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెబుతున్నప్పటికీ. ఆచరణలో రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ...

Read More »

రైతుల‌కు సంఫీుభావంగా ఉపవాస దీక్ష.

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ కొనుగోలు కేంద్రాల‌కు పంటల్ని తీసుకెళ్లడానికి ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాల‌ని, రైతు సమస్యలు పరిష్కరించాల‌ని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ఉపవాస దీక్షకు సంఫీుభావంగా బిజెపి ఇందూర్‌ నగర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్‌ ఇంట్లోనే మాతృ మూర్తి చేతుల‌ మీదుగా ఉపవాస దీక్ష ప్రారంభించారు.

Read More »

ఈఎంఐల‌ వాయిదాకు ఓటిపి అవసరం లేదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈఏంఐలు వాయిదా వేసుకోవడానికి ఓటీపీ అవసరం లేదని యూనియన్‌ బ్యాంక్‌ దుబ్బ బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రదీప్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించడంతో ప్రజల‌కు ఆర్ధిక మెసలుబాటు కల్పించేందు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రుణాల‌పై మూడు నెలల‌ పాటు మరిటోరియం విధించింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్‌ నేరగాళ్లు ఖాతా దారుల‌కు కాల్స్‌ చేస్తూ ఓటిపి పంచుకోవాల‌ని సూచిస్తున్నారని, ఓటిపిని షేర్‌ చేసిన ...

Read More »

పేదల‌కు అండగా అంగన్‌వాడి ఉద్యోగులు…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు కరోనా నివారణ చర్యల‌పై అంకితభావంతో విధులు నిర్వహిస్తూనే మరోపక్క పేదల‌కు ఆపన్నహస్తం అందిస్తున్నారు. మేమున్నాం మీకు అండగా అంటూ తమ వంతు సేలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల కేంద్రంలో గత 15 రోజులుగా జాతీయ రహదారిపై వెళ్లే వల‌స కార్మికుల‌కు రోజు భోజనం, అల్పాహారం, పండ్లను అనీస్‌ బేగం అనే కార్యకర్త అందజేస్తున్నారు. ఆర్మూర్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు గత మూడు నాలుగు రోజులుగా వల‌స కార్మికుల‌కు జాతీయ ...

Read More »

ఆటోడ్రైవర్లకు ఎమ్మెల్యే నిత్యవసర సరుకుల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన నేపథ్యంలో శుక్రవారం శెట్పల్లి సంగారెడ్డిలో ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకొని ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ వారికి నిత్యవసరా వస్తువులు, 500 రూపాయలు ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన రక్కసిని తరిమి కొట్టాలంటే అందరూ సామాజిక దూరం పాటించాల‌ని, విధిగా మాస్కులు ధరించాల‌ని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రైతు పండిరచిన ప్రతి గింజ ప్రభుత్వం ...

Read More »

మోస్రా గ్రామం రెడ్‌జోన్‌లో నిత్యవసరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మొస్రా గ్రామం రెడ్‌జోన్‌లో ఉన్న 60 కుటుంబాల‌కు, గ్రామ పంచాయితి సిబ్బందికి శ్రీ ల‌క్ష్మి నర్సింహ కిరాణ దుకాణం యజమాని యెర్ర ల‌ఖన్‌ 6 రకాల‌ కూరగాయల‌ కిట్‌ పంపిణీ చేశారు. అదేవిధంగా ఓల్డ్‌ బివిఎన్‌ స్కూల్‌ చైర్మన్‌ రంగారావు సార్‌ సహకారంతో మోస్రా గ్రామంలో 300 కుటుంబాల‌కు 5 రకాల‌ కూరగాయలు కిలో టొమోటో, కిలో బెండకాయ, కిలో వంకాయ, మున‌క్కాయ‌లు, మామిడికాయ భజరంగదల్‌ కార్యకర్తలు ఇంటి ఇంటికి పంపిణీ ...

Read More »

మాజీ క్రీడాకారుల‌కు, కోచ్‌ల‌కు నిత్యవసరాల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో మాజీ క్రీడాకారుల‌కు, ప్రైవేటు కోచ్‌ల‌కు నిత్యావసర సరుకుల‌ను అందించినట్టు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నరాల‌ సుధాకర్‌ తెలిపారు. వివిధ క్రీడల‌కు ప్రైవేటుగా కోచింగ్‌ ఇస్తూ జీవనం సాగిస్తున్న ప్రైవేట్‌ కోచ్‌ల‌కు శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఏర్పడిన తరుణంలో కబడ్డీ కోచ్‌ ప్రశాంత్‌ ద్వారా ప్రైవేట్‌, మాజీ క్రీడాకారుల‌ పరిస్థితిని తెలుసుకొని వారికి నిత్యావసర సరుకుల‌ను నరాల‌ సుధాకర్‌ అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన ...

Read More »