Breaking News

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదుల‌వారి ఆశీర్వాదముచే, శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరుపున లాక్‌ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల‌కు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖల‌కు ఆల‌యం తరఫున ఆహార పంపిణీ చేస్తున్నట్టు ఆల‌య ప్రతినిధులు తెలిపారు.

భీంగల్‌ పరిసర ప్రాంతాల‌తో పాటు జాగిర్యాల్‌, రామన్నపేట్‌, పురాణిపేట్‌, బెజ్జోర గ్రామాల‌కు దేవస్థానం నుండి మధ్యాహ్న భోజనం పంపిణీ చేసినట్టు తెలిపారు. శుక్రవారం పంపిణీలో భాగంగా 150 మంది సహాయకుల‌తో, 310 మందికి (460 ప్యాకెట్ల వెజిటబుల్‌ బిర్యాని) ఆల‌యం తరుపున వితరణ చేశామన్నారు.

Check Also

650 మందికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article