Breaking News

Daily Archives: April 25, 2020

షాదీ ముబారక్‌ చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల‌యం వద్ద షాదీ ముబారక్‌ చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గరెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, సిడిసి చైర్మన్‌ గంగారెడ్డి, తహసీల్దార్‌ నారాయణ, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మండల‌ సర్పంచ్‌ల సంఘం ...

Read More »

తేమ శాతం తప్పకుండా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తేమ శాతాన్ని తప్పనిసరిగా చూడాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ కొనుగోలు కేంద్రంలో మినరల్‌ వాటర్‌, టెంటు, శానిటీజర్లు, ప్రథమ చికిత్స పరికరాలు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏఈఓలు కూపన్లు ఇచ్చి కోతల‌ను నియంత్రించాల‌ని పేర్కొన్నారు. కూపన్లు పొందిన రైతులే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి ...

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం గున్కుల్‌ సహకార సంఘ పరిధిలో హసన్‌ పల్లి గ్రామ గేట్‌ వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి రైతు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల‌న్నారు. రైతు దళారుల‌ను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, బాన్సువాడ ఆర్డీవో ...

Read More »

అనాధల‌ను ఆదుకునే కార్యక్రమమే నిజామాబాద్‌ అన్నదాతలం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌లో చిక్కుకున్న అనాధల‌ను అభాగ్యుల‌ను ఆదుకొని వారికి భోజనం అందించడమే నిజామాబాద్‌ అన్నదాతలం కార్యక్రమ ల‌క్ష్యమని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్‌ ఫుడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుచేసిన అన్నదాత కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్‌ పేదల‌కు భోజనం వడ్డించారు. వల‌స కూలీల‌కు, నిరాశ్రయుల‌కు లాక్‌ డౌన్‌లో చిక్కుకున్న వారికి ఇతర రాష్ట్రాల‌ నుండి వచ్చిన పేదల‌కు భోజనం ...

Read More »

రక్తదానం ప్రాణదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చునని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించి మాట్లాడారు. పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి ఆరు నెలల‌కు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం చేయడం వ‌ల్ల‌ నీరసించి పోతారనే అపోహలు కొందరిలో ఉన్నాయని వాటిని వైద్య సిబ్బంది ...

Read More »

కామరెడ్డి ఐఎంఎ ఆధ్వర్యంలో పిపిఇ కిట్లు అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య మరియు శాఖ వారికి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వైద్యుల‌కు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా 100 పర్సనల్‌ ప్రోటేక్షన్‌ కిట్లు, 100 సానిటైజర్లు అందించారు. ఇట్టి సామాగ్రిని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ చంద్రశేఖరుకు ఐఎంఎ ప్రెసిడెంటు డాక్టర్‌ నరేందర్‌ రావు, సెక్రెటరీ డాక్టర్‌ రమేశ్‌ బాబు, కోషాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌ అందజేశారు. ప్రస్తుతం ...

Read More »

కరోనాను జయించిన వారికి యంత్రాంగం, ప్రజలు అండగా ఉంటారు.

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని మళ్లీ మీ కుటుంబ సభ్యుల‌ మధ్యకు వచ్చిన మీరు వీరుల‌తో సమానమని అందుకు మీ స్ఫూర్తికి జోహార్లు అర్పిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక యంత్రాంగం, ప్రజలు వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి శనివారం పట్టణంలోనీ ముజాహిద్‌ నగర్‌, బర్కత్‌ పుర ప్రాంతాల‌లో పర్యటించి కరోనా వైరస్‌ బారినపడి హైదరాబాదు ...

Read More »

కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా శని వారం ఢల్లీి నుండి రాష్ట్రా ప్రధాన కార్యదర్శులు, డిజిపితో కరోనా వైరస్‌ పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ తద్వారా ప్రజల సహకారం ఎదురవుతున్న సమస్యలు తదితర విషయాల‌పై ఆయన వారితో అభిప్రాయాలు వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సిపి కార్తికేయ, అదనపు డిసిపి ఉష విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Read More »

దోమకొండలో పోలీసు సిబ్బందికి సన్మానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలో శనివారం కరోన నేపథ్యంలో విశేష సేవలందిస్తున్న పోలీస్‌ సిబ్బందికి దోమకొండ వాస్తవ్యులు చెన్నం నారాయణ గుప్తా శాలువాతో సత్కరించారు. బియ్యం, పళ్ళు, కూరగాయలు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. అంతే కాకుండ 8 వ వార్డులో వార్డ్‌ సభ్యులు బుర్రి రవికుమార్‌ 15 రకాల‌ కిరాణా సరుకులు, సంగని రాజు 50 కిలోల‌ సన్న బియ్యం, 8 వ వార్డ్‌ లోని పేదల‌కు, నిరాశ్రయుల‌కు అందించి ...

Read More »

అమరవీరుల‌కు ఘన నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరవీరుల‌ వారోత్సవాల‌లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసిపిఐయు కార్యాల‌యంలో అమరవీరుల‌ స్మారకస్థూపానికి ఘనంగా నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ ఎంసిపిఐయు పార్టీ ఏప్రిల్‌ 14 నుండి 30వతేదీ వరకు అమరవీరుల‌ సంస్మరణ వారోత్సవాలు జరుపుతుందని అన్నారు. నాటి భారత సైనిక తిరుగుబాటునుండి వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తరువాత నేటి తెలంగాణ ఏర్పాటు పోరాటం వరకు, పోరాటంలో అమరులైన వీరుల‌కు, కరోన కట్టడి కోసం ప్రాణాల‌ను సమాజం ...

Read More »

650 మందికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌కనుగుణంగా, భీంగల్‌ మున్సిపల్‌ కార్యాల‌యం వారు నిర్వహించిన ‘‘అన్నదాత’’ కార్యక్రమానికి 300 మంది యాచకుల‌కు, పేదవారికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున మధ్యాహ్న భోజన వితరణ చేశారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో 650 మందికి మధ్యాహ్న భోజన సరఫరా నిర్వహించినట్టు ఆల‌య ప్రతినిధులు ...

Read More »

పుప్పాల‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుప్పాల‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 50 మంది వల‌స కూలీల‌ కుటుంబాల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ నిర్వాహకుడు పుప్పాల‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ నేపధ్యంలో వల‌స కూలీలు నిత్య అవసర సరుకుల‌ కొరకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మేము సైతం అంటూ ముందడుగు వేసి వారి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సాధ్యమైనంతగా 50 వల‌స కూలీల‌ కుటుంబాల‌కు నిత్యావసర వస్తువులు అందచేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కిషోర్‌ ...

Read More »

కరోనా ఫ్రీగా ఆర్మూర్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో జిరాయత్‌ నగర్‌కి చెందిన ఓ వ్యక్తి ఢల్లీిలో మర్కజ్‌ మీటింగ్‌కి హాజరై ఆర్మూర్‌కి తిరిగివచ్చారు. ఈ నెల‌ 7వ తేదీన సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది శనివారం డిశ్చార్జి అయి తన నివాసానికి చేరుకున్నాడు. కాగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అతనితో వీడియో కాల్‌లో మాట్లాడి బియ్యంతో పాటు నెల‌సరి సరుకులు ఉచితంగా పంపిణీ చేయించారు.   హోమ్‌ క్వారంటీన్‌లో ఉండాల‌ని ...

Read More »

విద్యార్థి సహయం అభినందనీయం…

బాన్సువాడ, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల‌ రోజులుగా కరోనా వైరస్‌తో పేద ప్రజలు పనులు లేక నిత్యావసర సరకులు కొనుక్కోలేని వారికి విద్యార్థి శ్రీయ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. తన కుటుంబీకులు ఇచ్చిన ప్యాకెట్‌ డబ్బుతో, తన కుటుంబ తల్లీ, తండ్రి శివ, రేణుక ప్రోత్సహంతో వర్ని మండలం ఎస్‌.యెన్‌.పురం గ్రామ పంచాయతి పారిశుద్య కార్మికుల‌కు, పేద 150 కుటుంబాల‌కు 9 రకాల‌ కూరగాయ‌లు, మాస్కులు పంపిణి చేశారు. కార్యక్రమానికి విద్యార్థి శ్రీయ ఆహ్వానం మేరకు స్తానిక ...

Read More »

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండలంలోని ఉన్నత పాఠశాల‌ ఉపాధ్యాయులు జంగంపల్లి పరిసర ప్రాంతంలోని ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల‌కు నిత్యవసర సరుకులు అందజేశారు. సుమారు 50 కుటుంబాల‌కు వితరణ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ నర్సింలు యాదవ్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌తో కార్మికుల‌ పరిస్థితిని గమనించి ఉపాధ్యాయులు స్పందించి సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఉన్నత పాఠశాల‌ ప్రధానోపాధ్యాయులు లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని అందరిని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ...

Read More »

స్టాఫ్‌ నర్సుల‌ నియామకం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 నివారణ చర్యల్లో భాగంగా రోగుల‌కు మరింత మెరుగైన సేవ‌లు అందించేందుకు గాను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుల‌ నియామకం చేసినట్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌ రావు తెలిపారు. స్టాఫ్‌ నర్సుల‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థుల‌కు శనివారం జీజీహెచ్‌లో ధ్రువపత్రాలు పరిశీలించి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల‌తో జిల్లాలో 60 మంది ...

Read More »

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నందిపేట మండలం కోమటిపల్లి గ్రామంలో మూడు గ్రామాల‌ ఎంపిటిసి సభ్యురాలు మద్దుల‌ రాణి మురళీ, డొంకేశ్వర్‌ సహకార సంఘం ఛైర్మన్‌ భరత్‌ రాజ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల‌ వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా, రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. సామాజిక దూరం పాటించాల‌ని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు నాగరాజు, డైరెక్టరు సంజీవ్‌, జిల్లా విద్య క్రీడ కార్యదర్శి ...

Read More »

నర్సరీ కార్మికుల‌కు మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల‌ కేంద్రంలోని హరితహారం నర్సరీ వద్ద అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచనల‌ మేరకు నర్సరీ కార్మికుల‌కు, అధికారుల‌కు, ప్రజాప్రతినిధుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసినట్టు రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు ల‌క్కాకుల‌ నరేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా కట్టడిలో భాగంగా కార్మికులు, అధికారుల సేవ‌లు మరువలేనివని అన్నారు. ...

Read More »

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ

నందిపేట్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నందిపేట మండలం కోమటిపల్లి గ్రామ అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీల‌కు పోషక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి మాట్లాడుతూ గర్భిణీల‌కు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని చెప్పారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల‌ని, ఒక వేళ బయటకు వెళ్తే మాస్కు తప్పనిసరిగా ధరించాల‌ని ఎంపిటిసి మద్దుల‌ రాణి మురళీ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

బాన్సువాడలో సమర్థవంతమైన చర్యల‌తో కరోనా కట్టడి చేయగలిగాం

బాన్సువాడ, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణం, మోస్రా మండల‌ కేంద్రంలోని కరోనా క్వారంటైన్‌ ప్రాంతాల‌లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పర్యటించారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై క్వారంటైన్‌లో ఉన్న వారితో పాటుగా, కరోనా పాజిటివ్‌తో చికిత్స తీసుకుని గాంధీ హాస్పిటల్‌ నుండి ఆరోగ్యంగా తిరిగి వచ్చి ఇంటి దగ్గర ఉన్న వారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాల‌నీ, అరాఫత్ కాల‌నీ, మదీనా కాల‌నీ, మిస్రీ గల్లీ, ...

Read More »