Breaking News

Daily Archives: April 26, 2020

132 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 132 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 131, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు ఆదివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ ...

Read More »

బసవేశ్వర జయంతి సందర్భంగా పేదల‌కు నిత్యవసరాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాల‌నీలో మహాత్మ శ్రీ బసవేశ్వర మహారాజ్‌ 887 జయంతిని వీరశైవ లింగాయత్‌ సమాజ్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర్‌ మహారాజ్‌ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కపిల‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ బసవేశ్వర్‌ మహారాజ్‌ గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని 140 మంది నిరుపేదల‌కు నిత్యావసర సరుకుల‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీరశైవ లిగాయత్‌ సమాజ్‌ ...

Read More »

బిజెపి జిల్లా అధ్యక్షునిగా బస్వా ల‌క్ష్మీనర్సయ్య

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బల‌మైన శక్తిగా భారతదేశం ఎదుగుతుందని, ఈ సమయంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీ జనతా పార్టీ అవతరిస్తున్న తరుణంలో తనకు నిజామాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నట్టు బస్వా ల‌క్ష్మీనర్సయ్య తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలలాగా కాకుండా భారతీయ జనతా పార్టీకి మూలం కార్యకర్తల‌ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల‌తో నిర్మాణమైన పార్టీఅని అందువల‌న మొదటి ల‌క్ష్యం కార్యకర్తల‌ ...

Read More »

గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని అరగొండ గ్రామం రాజరాజేశ్వర ఆల‌యంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వరుడి 887 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన సమాజంలో ఉన్న వర్ణ బేధాల‌ను, లింగ వివక్షను, కుల‌ వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యుదయవాది అన్నారు. అనంతరం ...

Read More »

నలుగురు డిశ్చార్జ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం నలుగురు పేషెంట్లు పూర్తిగా కోలుకొని వారి ఇళ్లకు డిశ్చార్జ్‌ చేయబడ్డారని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 61 మంది వైరస్‌ బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్సకు పంప పడ్డారని వారిలో 2 రోజుల‌ క్రితం 30 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ చేయబడగా మరో నలుగురు వైరస్‌పై పోరాడి విజయం సాధించి ...

Read More »

లింబాద్రి నృసింహస్వామి ఆల‌యం తరఫున భోజనం వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా, 300 మంది యాచకుల‌కు, పేదవారికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున ఆదివారం మధ్యాహ్న భోజన వితరణ చేశారు. రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో 650 మందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేపట్టారు. కార్యక్రమంలో ఆల‌య ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

బాటసారుల‌కు పాదరక్షల‌ వితరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ పొద్దుటూరి వినయ్‌ రెడ్డి ఆదేశాల‌ మేరకు బాటసారుల‌కు పాదరక్షలు పంపిణీ చేశారు. గత కొద్దిరోజులుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో వినయ్‌ రెడ్డి పెళ్ళి రోజు సందర్భంగా స్థానిక సిఐ రాఘవేంద్ర సల‌హా మేరకు పాదరక్షలు వితరణ చేసినట్టు తెలిపారు. కాగా ఆదివారం జాతీయ రహదారి వెంబడి సొంత రాష్ట్రాల‌కు నడుచుకుంటూ వెళుతున్న పాదచారుల‌కు, వల‌స కార్మికుల‌కు సిఐ రాఘవేంద్ర ...

Read More »

పారిశుద్య కార్మికుల‌కు బియ్యం పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా లాక్‌ డౌన్‌ సందర్బంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రామారెడ్డి మండలం అన్ని గ్రామ పారిశుధ్య కార్మికుల‌కు, 100 మందికి సంస్థ నిర్వాహకులు వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి రామరెడ్డి మండల‌ కేంద్రంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోన వ్యాప్తి నిర్మూల‌నలో అహర్నిశలు పనిచేస్తున్న గ్రామ పారిశుద్ధ కార్మికుల‌ కుటుంబాల‌కు సహాయం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి మోహన్‌ ...

Read More »

బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం

సంగారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావుతో కలిసి సంగారెడ్డిలో మహాత్మా బసవేశ్వర 887 జయంతి సందర్బంగా ఆయన విగ్రహనికి పూల‌మాల‌ వేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ బసవేశ్వరుని బోధనలు ఎప్పటికి ఆచరణీయమన్నారు. కరోన పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాల‌న్నారు. ఇంట్లోనే ఉంటూ పోలీస్‌ వారికి సహకరించాల‌ని సూచించారు. ఈ సందర్బంగా ఎంపీ బి.బి.పాటిల్‌ మాట్లాడుతూ ప్రేమతత్వాని, ...

Read More »

వంద కుటుంబాల‌కు వార్డు మెంబర్‌ నిత్యవసరాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో 7వ వార్డులో ఇంటింటికి 15 రకాల‌ 400 విలువచేసే నిత్యావసరాల‌ సరుకులు 100 కుటుంబాల‌కు వార్డ్‌ మెంబర్‌ అన్మా రామ్‌ కుమార్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పిఏసిఎస్‌ మాజీ చైర్మన్‌ అన్మాల‌ గంగయ్య, అన్మాల‌ దామోదర్‌, ఉప సర్పంచ్‌ వనిత రాజిరెడ్డి, భాస్కర్‌, రజినీకాంత్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, భుజంగం, రాజశేఖర్‌, రామ్‌ చంద్రం, అనిల్‌, ల‌క్ష్మీపతి, శ్యామ్‌ రావు, బాల‌రాజు పాల్గొన్నారు.

Read More »

పేదల‌కు ఎక్సైజ్‌ ఉద్యోగుల‌ సాయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ వ‌ల్ల‌ అనేక మంది పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఉద్యోగులు ఎంతో కొంత సాయం చేయాల‌ని భావించారు. అనుకున్నదే తడవుగా తలా కొంత డబ్బు సేకరించి లాక్‌ డౌన్ వ‌ల్ల‌ పని లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదల‌కు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. ఆదివారం కస్బాగల్లి, వినాయక నగర్‌, హౌజింగ్‌ బోర్డు ప్రాంతాల్లో పేదల‌ను గుర్తించి నిత్యావసరాలు ...

Read More »

ఘనంగా బసవేశ్వర 887వ జయంతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ, తెలంగాణ వీరశైవ లింగాయత్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బి.బి.పాటిల్‌ మహాత్మా బసవేశ్వరుని 887 జయంతి సందర్బంగా ట్యాంక్‌ బండ్‌ వద్ద ఆయన విగ్రహానికి పూల‌మాల‌ వేసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

స్వచ్చంద సంస్థల‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌`19 కరోన లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో రక్త నిలువ‌లు తగ్గినందున రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు ఆదివారం నిజామాబాద్‌లోని శ్రీనగర్ కాల‌నీ వెల్ఫేర్‌ సొసైటీ, శ్రీ ల‌క్ష్మీ చేయూత సేవా సమితి, ల‌యన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్త దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేశారు. కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రెడ్‌ క్రాస్‌ కృతజ్ఞతలు తెలిపింది.   శ్రీ ...

Read More »

ఆర్మూర్‌లో వల‌స కూలీల‌కు ఆహార వితరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు లాక్‌ డౌన్‌ కారణంగా ఆర్మూర్‌ జర్నలిస్ట్ కాల‌నీలో ఆదివారం ఆహార వితరణ చేపట్టారు. బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ 100 పులిహోర ప్యాకెట్లు, 20 మందికి 5 కిలోల‌ చొప్పున బియ్యం, రాజ్‌ పురోహిత్‌ నార్పత్‌ 25 కిలోల‌ బియ్యం, ఎర్ర భూమయ్య 5 కిలోల‌ కందిపప్పు నిరుపేదల‌కు, వల‌స కూలీల‌కు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ కాల‌నీ ఆల‌య కమిటీ ఇంచార్జ్‌ గటడి ...

Read More »

231 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 231 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 218, ఆటోలు 4, ఫోర్ వీల‌ర్స్‌ 9 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా అంతటా ఉదయం 6 గంటల‌ నుండి సాయంత్రం 6 గంటల‌ వరకు మాత్రమే కిరాణా నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, మెడికల్‌ దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రజలు గమనించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే దుకాణాల‌ వద్ద యజమానులు, వారి ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాల‌ని, సామాజిక దూరం ఖచ్చితంగా ఉండవల‌సిందే అని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించవల‌సిందేనని, బయటకు ...

Read More »