Breaking News

Daily Archives: April 27, 2020

10 లీటర్ల నాటుసారా, 110 లీటర్ల క్లు ధ్వంసం

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఉదయం క్యాసంపల్లి తాండాలో విశ్లవత్‌ భాస్కర్‌ వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్టు సిఐ ఫణీందర్‌ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడు నిర్వహించామన్నారు. అదేవిధంగా ఉగ్రవాయి శివారులో పంట పొలాల్లో దాడు చేయగా నరేశ్‌ అనే వ్యక్తి వద్ద నుంచి 15 సిగ్నెచర్‌ బాటిల్స్‌ భించాయన్నారు. దేవంపల్లిలో అక్రమంగా క్లు విక్రయిస్తున్న శ్రీనివాస్‌ గౌడ్‌ను, నర్సవ్వ వద్ద సుమారు 110 లీటర్ల క్లు ద్వంసం చేసినట్టు ...

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌, ఎల్లారెడ్డి మండలం గండి మాసానిపేట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ సందర్శించారు. కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల‌కు అధికారులు కూపన్లు ఇవ్వాల‌ని సూచించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం చేయాల‌న్నారు. కొనుగోలు కేంద్రాల‌ వద్ద రైతుల‌కు ఇబ్బందులు కల‌గకుండా చూడాల‌ని కోరారు. కలెక్టర్‌ ఆర్‌డివో దేవేందర్‌ రెడ్డి, తహసిల్దార్‌ నారాయణ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు,

Read More »

24 గంటల్లో ధాన్యం దించుకోకుంటే రైస్‌ మిల్‌ సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్‌కు చేరుకున్న లారీలో నుండి ధాన్యాన్ని 24 గంటల్లో దించుకోకుంటే సంబంధిత రైస్‌ మిల్‌ సీజ్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం ఆయన మోపాల్‌ మండలం కంజర గ్రామంలో, డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతుల‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంప్‌ కార్యాల‌యం నుండి సహకార శాఖ సివిల్‌ సప్లై, సంయుక్త కలెక్టర్‌ ...

Read More »

పేదల‌కు జనం పాట కళాకారుల‌ చేయూత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ‘జనం పాట’ కళాకారుల‌ ఆధ్వర్యంలో కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆహారం కొరకు అల‌మటిస్తున్న పేదల‌కు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘జనం పాట’ వ్యవస్థాపకుడు రాంపూర్‌ సాయి మాట్లాడుతూ కొరొనా లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ఆహారం కొరకు అల‌మటిస్తున్న వారికి నిత్యావసర వస్తువుల‌ను పంపిణీ చేయాల‌నే ఉద్దేశంతో సాటి కళాకారుల‌ సహాయ సహకారాల‌తో స్వచ్చంధంగా ఆదర్శ్‌ నగర్‌, హమాల్‌ వాడీ, నాందేవాడ, ఆర్యనగర్‌ తదితర ప్రాంతాల్లో ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల‌కు నాణ్యమైన హ్యాండ్‌ గ్లౌజుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి చెందిన డాక్టర్‌ శ్యామ్‌ సుందర్‌, వి.టి.లాల్‌, బాంబే క్లాత్‌, మోహన్‌ లాల్‌ పటేల్‌, డా.వెంకట కృష్ణ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో సోమవారం నాణ్యమైన హ్యాండ్‌ గ్లౌజులు 260 మంది మున్సిపల్‌ కార్మికుల‌కి అందజేశారు. వీటిని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌, కమీషనర్‌ ద్వారా అందజేశారు. వాటి వినియోగంపై ప్రస్తుత పరిస్థితుల‌పై కార్మికుల‌కు వివరించారు. హ్యాండ్‌ గ్లౌస్‌ల‌ను వాడాల‌ని, సానిటైజర్‌ వినియోగించాల‌ని చెప్పారు. తద్వారా కరోన బారిన పడకుండా ఉండాల‌ని చెప్పారు. ప్రజారోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో నమూనా సేకరణ కేంద్రం ఏర్పాటు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కరోనా వైరస్‌ నమూనాను సేకరించడానికి ప్రత్యేక కేంద్రాన్ని సిద్ధం చేయించినట్టు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నమూనాలు తీసుకునే వైద్య సిబ్బందికి మరింత రక్షణగా కేంద్రాన్ని సిద్ధం చేశామని 5 రోజుల్లో దీనిని పూర్తి చేయడానికి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆసుపత్రి పర్యవేక్షకులు నాగేశ్వరరావు, కృషి చేశారని కలెక్టర్‌ తెలిపారు. పేషెంట్లు ఒకరికొకరు కలిసే అవకాశం లేకుండా వేరువేరుగా శాంపిల్స్‌ తీసుకోవడానికి కేంద్రం ...

Read More »

చెరువు పూడికతీత పనులు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పూడికతీత పనులు చేపట్టాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో వివిధ మండలాల‌ అధికారుల‌తో ఉపాధి హామీ పనుల‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కువ పనుల‌ను గుర్తించి, కూలీల‌కు పనులు కల్పించాల‌ని, పనులు చేసేటప్పుడు కూలీలు సామాజిక దూరం పాటించే విధంగా చూడాల‌ని కోరారు. గ్రామాల్లో శ్రమశక్తి సంఘాల‌తో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామములో చేపట్టే నీటి సంరక్షణ ...

Read More »

నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలోని రహేమాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సుమారు 150 మంది క్రైస్తవ పాస్టర్‌ల‌కు ఒక్కొక్కరికి 25 కిలోల‌ బియ్యం, కిలో పప్పు, నూనె ప్యాకెట్‌, 5 కిలోల‌ వివిధ కూరగాయల‌ నిత్యావసరాల‌ కిట్లు నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ పేద ప్రజల‌కు సహాయం చేయాల‌ని సూచించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

తెరాస జెండా ఆవిష్కరించిన నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్‌ పట్టణంలోని 4వ వార్డ్‌ మహా రెడ్డి భూపాల్‌ రెడ్డి కాల‌ని వద్ద టిఆర్‌ఎస్‌ పార్టీ జెండాను నారాయణఖేడ్‌ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వార్డు వాసుల‌కు నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్‌లు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు అందరు సామాజిక దూరం పాటించాల‌ని, లాక్‌ డౌన్‌ పాటించి ఇళ్ల వద్దనే ఉండాల‌న్నారు. బయటకు వస్తే తప్పకుండా మాస్కు ధరించాల‌ని ...

Read More »

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని బండ రెంజల్‌, పుల్క‌ల్‌ గ్రామాల్లో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల‌ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు దళారుల‌ను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఆరుగాలం కష్టపడి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయరాదన్నారు. రైతుల‌కు మద్దతు ధర కల్పించి, పండిరచిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి కొనుగోలు ...

Read More »

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్‌ పార్టీ జెండాను మండల‌ అధ్యక్షుడు సాదుల‌ సత్యనారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు దుర్గారెడ్డి, ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, సిడిసి చైర్మన్‌ గంగారెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల‌ సర్పంచ్‌ల‌ సంఘం అధ్యక్షు రమేష్‌ గౌడ్‌, సందీప్‌, యాటకారి నారాయణ, సత్యనారాయణ, లింగాగౌడ్‌, రమేష్‌, గైని రమేష్‌, సొసైటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, మహేందర్‌ సేట్‌ విజయ్‌, సర్పంచ్‌ సంగమేశ్వర్‌ గౌడ్‌, ...

Read More »

శ్రీనన్న యువ సైన్యం ఆధ్వర్యంలో ఆహార వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఇరవై ఎనిమిదవ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు ‘శ్రీనన్న యువసైన్యం’ 300 మందికి వెజిటైబుల్‌ బిర్యానీ వాటర్‌ పాకెట్లు అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు, నిరుపేదలు గ్రామాల‌నుండి వచ్చే రోగుల‌కు, కరోనా వ‌ల్ల‌ పనులు లేక ఇబ్బంది పడుతున్నదిక్కు తోచని వల‌స కార్మికుల‌కు, భవన నిర్మాణ కార్మికుల‌కు ఆహారం పంచిపెట్టారు. కరోనా లాక్‌ డౌన్‌ అమలైనప్పటి నుంచి నేటికీ 28 రోజుల‌ ...

Read More »

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల‌కు ధాన్యం తీసుకురావాలి

నిజాంసాగ‌ర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో గున్కుల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిడిసి చైర్మన్‌ గంగారెడ్డి, గున్కుల్‌ సొసైటీ చైర్మన్‌ వాజిద్‌ అలీ, మండల‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సాదుల‌ సత్యనారాయణ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ మాట్లాడుతూ రైతులు దళారుల‌ను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల‌కు రైతులు ధాన్యాన్ని విక్రయించాల‌న్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు అబ్జల్‌, జీవన్‌, రాము, ...

Read More »

శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా సోమవారం 350 మంది యాచకుల‌కు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేశారు. అంతే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More »

వందశాతం వరి ధాన్యం కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ధాన్యం కొనుగోలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల‌ మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంత్రి సోమవారం మోతే, రామన్న పేట్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం కూడా రేషన్‌ ఇవ్వడానికి ఎంతైతే బియ్యం అవసరం ఉంటుందో అంత మేరకే సరిపడా ...

Read More »

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఇంటి వద్ద మాస్కులు పంపిణీ చేశారు. అనతరం ఎమ్మెల్యే పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెరాస యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చెలిమెల‌ భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్త దాన శిభిరానికి ముఖ్య అథిదిగా ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ హాజరై స్వయంగా రక్తదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ...

Read More »

కంట్రోల్‌ రూమ్‌లో ఫిర్యాదులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌ కార్యాల‌యంలో ప్రజల‌ నుండి కరోనా వైరస్‌, ధాన్యం కొనుగోలు ఇతర ఫిర్యాదుల‌ను స్వీకరించడానికి ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా పర్యటించి ఫిర్యాదుల‌ను పరిశీలించారు. ఫిర్యాదు రిజిస్టర్‌లో ఫిర్యాదుల‌ను స్వీకరిస్తున్న వివరాల‌ను అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాల‌ని సిబ్బంది ఆయా శాఖల‌కు సమాచారం అందించాల‌ని, ఫిర్యాదుల‌ పరిష్కారానికి తీసుకున్న చర్యల‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చర్యల‌ వివరాల‌ను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాల‌ని సిబ్బందిని ...

Read More »

తెరాస జెండా ఆవిష్కరించిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నందిపేట మండలం తొండకురు గ్రామంలో ఎమ్మెల్యే ఆదేశాల‌ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావం సందర్భంగా ఎంపిటిసి మద్దుల‌ రాణి, మురళితో కలిసి తమ ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా షాపురు, తొండకూరు, కోమటిపల్లి ప్రజల‌కు, తెలంగాణ రాష్ట్ర ప్రజల‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్య క్రీడల‌ కార్యదర్శి మద్దుల‌ మురళి పాల్గొన్నారు.

Read More »