Breaking News

Daily Archives: April 28, 2020

రైస్‌మిల్‌ సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనల‌కు విరుద్ధంగా పని చేస్తున్నందుకు గాను సహారా రైస్ మిల్లును సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ సివిల్‌ సప్లైస్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఖానాపూర్‌లోని ఆహార రైస్‌ మిల్‌ ధాన్యం సేకరణలో కర్తా అధికంగా తీసుకోవడంతోపాటు వచ్చిన ధాన్యాన్ని ఆల‌స్యంగా డౌన్‌లోడ్‌ చేయడం తీసుకున్న ధాన్యాన్ని సూచించిన గోదాంలో కాకుండా వేరేచోట స్టోర్‌ చేయడం తదితర కారణాల‌తో రైసు మిల్లును సీజ్‌ చేసినట్టు ఆయన ప్రకటనలో తెలిపారు.

Read More »

ధాన్యం కొనుగోలులో అల‌సత్వం ఉంటే చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎట్టి పరిస్థితుల్లో రైతుల‌కు నష్టం జరగకుండా యంత్రాంగం పనిచేయాల‌ని రైతు కంటే ముఖ్యమైంది ఇంకొకటి లేదని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి రెండు గంటల‌ పాటు సంబంధిత అధికారుల‌తో ధాన్యం కొనుగోలుపై రైతు సమస్యల‌పై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు 20 వేల‌ నుండి 30 వేల‌ మెట్రిక్‌ టన్నుల‌ వరి ధాన్యం సేకరించి మిల్లుకు చేరుకొని అన్‌లోడ్‌ కావాల‌ని ...

Read More »

అకాల‌ వర్షాలు అపార నష్టాలు

జగిత్యాల్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం జగిత్యాల‌ జిల్లా రాయికల్‌ మండలం రాజనగర్‌ గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్లవానతో వడ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రైతు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట మొత్తం ఇలా వర్షం పాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ల‌బోదిబో మంటున్నారు. అన్నమో రామ చంద్ర అంటూ తల‌లు పట్టుకుంటున్నారు. పూర్తిగా ఎండిన వడ్లు అధికారుల‌ షరతులు, మిల్ల‌ర్ల ఆగడాల‌తో తూకం చేయకుండా జాప్యం చేయడంతో రైతుల‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ...

Read More »

శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాతల‌ కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు 350 మంది యాచకుల‌కు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేశామన్నారు.

Read More »

దశాబ్దాల కల‌ నెరవేరింది

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తాడ్వాయి మండలంలో ఎంపీ బి.బి.పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన రూ.7 ల‌క్షల‌ రూపాయల‌ చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేశారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలో 3.54 కోట్లతో 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న పెద్ద చెరువు కట్ట రోడ్డు పనుల‌ను ఎంపీ బి.బి.పాటిల్‌, ఎమ్మెల్యే జె.సురేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభించడం ద్వారా ఎల్లారెడ్డి ప్రజల‌ దశాబ్దాల క‌ల‌ నెరవేరిందన్నారు. ...

Read More »

వంద కుటుంబాల‌కు నిత్యవసరాలు పంపిణీ చేసిన సిపి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో మంగళవారం పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌ డివిజన్‌ 1వ టౌన్‌ గంజి మార్కెట్‌లో, 3వ టౌన్‌ పరిధిలోని పాముల‌ బస్తీలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు డిసిపి (లా అండ్‌ ఆడర్‌) రఘువీర, టౌన్‌ సిఐ సత్యనారాయణ, 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు, 3వ టౌన్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More »

డబు బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టర్‌ చాంబర్లో మంగళవారం పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. సిమెంట్‌ పరిశ్రమలు ప్రారంభమైనందున రెండు పడక గదుల‌ ఇళ్ల నిర్మాణం పనుల‌ను చేపట్టాల‌ని సూచించారు. బిల్లులు సకాలంలో చెల్లించాల‌ని పేర్కొన్నారు. బిల్లుల‌ చెల్లింపులో జాప్యం చేయవద్దని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అధికారులు సిద్ధిరాములు, మురళి, ...

Read More »

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులు సేకరిస్తున్నారు. రెండవ దఫాలో మచ్చర్ల గ్రామంలో ఏఐకెఎంఎస్‌ రాజన్న, పివైఎల్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ చొరవతో దాతలు మరో 5 క్వింటాళ్ల బియ్యం, ఉంగరాల‌ రాకేష్‌, బ్రహ్మయ్య, ద్యావతి నారాయణ, గొల్ల‌ నవీన్‌లు రూ. 5 వేలు అందజేశారు. అట్లాగే దేగాం ప్రభు, అంక్సాపూర్‌ గంగమ‌ల్లు చెరో క్వింటాలు బియ్యం అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

సమాజ సేవకులు సోమానిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ కో కన్వినర్‌, సామాజిక సేవకులు శామ్‌ ఏజెన్సీ అధినేత నగరంలోని ప్రముఖ వ్యాపార వేత్త సోమాని నిరుపేదల‌కు ముఖ్యంగా రేషన్‌ కార్డ్‌ లేని కుటుంబాల‌ వారికి లాక్‌ డౌన్‌ సమయంలో గొప్ప సంక‌ల్పంతో పేదల‌కు బియ్యం పంపిణీ చేపడుతున్నారు. నగర పరిధిలోని పార్టీల‌కు అతీతంగా కార్పొరేటర్ల ద్వారా వివిధ డివిజన్‌లోని పేదప్రజల‌కు, వివిధ సామాజిక సేవల‌కు, రాజకీయ పార్టీ నాయకుల‌ ద్వారా అన్ని వార్డుల‌లోనీ పేదల‌కు, కొన్ని ...

Read More »

సామాజిక దూరమే కరోనా కట్టడికి ఆయుధం

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడమే ఆయుధంగా భావించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో మండల‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌ డౌన్ అమలు చేయడానికి గ్రామస్థాయి అధికారుల‌ బృందం, మండల‌ స్థాయి అధికారుల‌ బృందం సభ్యులు పకడ్బందీగా కృషిచేయాల‌ని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ వద్ద సామాజిక దూరం పాటించే విధంగా చూడాల‌న్నారు. మాస్కులు, శాని టీజర్లు అందుబాటులో ఉంచాల‌ని, ...

Read More »

400 మంది ఆటో కార్మికుల‌కు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నాగిరెడ్డిపేట్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌ డౌన్ వ‌ల్ల నెల‌ రోజులుగా ఆటోలు నడవలేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా ఆటోలు నడిపే నిరుపేదల‌కు మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ ఆధ్వర్యంలో ఎంపీ బి.బి పాటిల్‌ నాగిరెడ్డిపేట్‌ మండలానికి చెందిన ఆటో నడిపే 400 మంది కార్మికుల‌కు చేయూతనందించారు. ఒక్కో కార్మికునికి నిత్యావసర వస్తువుల‌తో పాటు రూ.500 లు పంపిణి చేసారు. కార్యక్రమంలో మార్కేట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ...

Read More »

కరోనా బాధితుల‌కు అన్నదానం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించినందున ఎంతో మంది వల‌స కార్మికులు, నిరుపేదలు అన్నానికి అల‌మటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎన్నోళ్ల అంజలి మంగళవారం అన్నదానం చేశారు. మొత్తం 70 మందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కుచి కిషన్‌ పంతులు, పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

30న మహర్షి భగీరథ జయంతి ఇంట్లోనే జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనె 30వ తేదీన మహర్షి భగీరథ జయంతిని ప్రభుత్వం పరిమితం చేసినట్టు కామారెడ్డి జిల్లా వెనకబడిన తరగతుల‌ అభివృద్ధి శాఖ అదికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి భగీరథ జయంతిని ప్రజలు ఇంట్లోనే జరుపుకోవాల‌ని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ మే 3 వరకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ మే 7 వరకు కొనసాగుతుందన్న విషయం తెలిసిందే.

Read More »

రామానుజాచార్యుల‌ జయంతి సందర్భంగా నిత్యవసరాల‌ పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం శ్రీ రామానుజాచార్యుల‌ జయంతి సందర్భంగా ఆర్మూర్‌ జర్నలిస్ట్ కాల‌నీ ఆల‌యం వద్ద ఆర్మూర్‌ బీజేపి నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరు వినయ్‌ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 25 మంది నిరుపేదల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కెనాల్‌ కట్ట, వాజ్‌పాయ్‌ నగర్ కాల‌నీలో వున్న నిరుపేదల‌కు పంపిణ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడీ పిలుపుతో ఆర్మూర్‌ ...

Read More »

200 మాస్కులు కుట్టి పంపిణీ చేసిన వార్డు కౌన్సిల‌ర్‌ సంగీత ఖాందేష్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పిలుపు మేరకు ఆర్మూర్‌ పట్టణం రెండవ వార్డు కౌన్సిల‌ర్‌ సంగీత ఖాందేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా తెరాస జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌ హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెరాస రాష్ట్ర నాయకులు ఖాందేష్‌ శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్‌ సంగీత దంపతుల‌ ఆధ్వర్యంలో పేదవారికోసం ఏర్పాటు చేసిన బియ్యం, నిత్యావసర ...

Read More »

కాషాయ జెండాలు పెట్టడానికి వెనుకాడొద్దు – న్యాయవాది సురేంద‌ర్‌రెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల‌ కాలంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో కూరగాయలు, పండ్లు విక్రయించే తోపుడు బళ్ళపై, వాహనాలపై ఏర్పాటు చేసిన కాషాయ జెండాలు పోలీసులు తీసివేయించిన విషయం  వెలుగులోకి వచ్చినాయి. హిందూ ధర్మానికి సంబంధించిన కాషాయ జెండాలు గాని, దేవీ దేవతల‌ చిత్రపటాలు గానీ ఏర్పాటు చేసుకునే మతస్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉన్నదని కామారెడ్డి లోని ప్రముఖ న్యాయవాది, కామారెడ్డి బార్‌కౌన్సిల్‌ కార్యదర్శి బి.సురేంద‌ర్ రెడ్డి తెలిపారు. మత చిహ్నాలను బలవంతంగా తీసివేయడం ...

Read More »

విద్యుత్‌ ఉద్యోగుల‌కు మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల‌ కేంద్రంలోని విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ శాఖ అధికారుల‌కు అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు సూచనల‌ మేరకు ఉచితంగా మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సానిటైజర్‌లు పంపిణీ చేసినట్టు రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు ల‌క్కాకుల‌ నరేష్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోన నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ ఉద్యోగుల సేవ‌లు మరువలేనివన్నారు. ప్రజలందరు ...

Read More »